అక్రమ సంబంధం, ప్రియురాలి భర్తను చంపేసి... ‘దృశ్యం’ సినిమా రేంజ్ లో...

By telugu teamFirst Published Feb 3, 2020, 1:05 PM IST
Highlights

తన భార్యతో అమర్ సింగ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే విషయం పంకజ్ దిలీప్ కి తెలిసిపోయింది. ఈ వ్యవహారం ఇక్కడితో ఆపేయాలని పంకజ్ వార్నింగ్ ఇచ్చాడు. అయినా.. వాళ్లు తమ వ్యవహారాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. దీంతో పంకజ్ కి కోపం బాగా పెరిగిపోయింది.

వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమె భర్తకు తెలీకుండా సరసాలు ఆడుతూ వచ్చాడు. ఒక రోజు ఆ విషయం ఆమె భర్తకు తెలిసిపోయింది. అంతే... ఇద్దరినీ నిలదీశాడు. ఇక్కడితో ఇదంతా ఆపేయాలంటూ ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చాడు.

 ఈ విషయంలో సదరు మహిళ భర్తకు, ప్రియుడికి గొడవ జరిగింది. ఈ క్రమంలో... సదరు మహిళ భర్తను ప్రియుడు చంపేశాడు. నేరం చేశాక పోలీసులుకు దొరికిపోతానేమో అనే భయం అతనిలో కలిగింది. అంతే పోలీసులకు దృశ్యం సినిమా చూపించాడు.  ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్ లో చోటుచేసుకుంది.

Also Read మైనర్ బాలికను గర్భవతి చేసిన మేనమామ.. ఫిర్యాదు చేయకున్నా..

పూర్తి వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని నాగపూర్ పట్టణానికి చెందిన పంకజ్ దిలీప్ గిరాంకర్(32) అనే వ్యక్తికి పెళ్లై భార్య ఉంది. అతను హల్దీరామ్ కంపెనీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు. కాగా... పంకజ్ దిలీప్ భార్యతో అమర్ సింగ్ అలియాస్ లాలు జోగేందర్ సింగ్ ఠాకూర్(24) అనే యువకుడు వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అమర్ సింగ్ కి ఓ ఫుడ్ స్టాల్ కూడా ఉంది.

అయితే... తన భార్యతో అమర్ సింగ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే విషయం పంకజ్ దిలీప్ కి తెలిసిపోయింది. ఈ వ్యవహారం ఇక్కడితో ఆపేయాలని పంకజ్ వార్నింగ్ ఇచ్చాడు. అయినా.. వాళ్లు తమ వ్యవహారాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు. దీంతో పంకజ్ కి కోపం బాగా పెరిగిపోయింది.

ఈ క్రమంలో గతేడాది డిసెంబర్ లో పంకజ్ దిలీప్ తన బైక్ వేసుకొని అమర్ సింగ్ ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లాడు. అక్కడ తన భార్య విషయమై అమర్ సింగ్ తో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో అమర్ సింగ్ ఇనుప రాడ్డుతో తలపై కొట్టి పంకజ్ ని చంపేశాడు. దెబ్బ గట్టిగా తగలడంతో అతను అక్కడికక్కడే  చనిపోయాడు.

దీంతో తాను పోలీసులకు దొరికిపోతానేమో అని అమర్ సింగ్  చాలా భయపడిపోయాడు. ఈ హత్య కేసు నుంచి తప్పించుకోవాలని ‘దృశ్యం’ సినిమా రేంజ్ లో స్కెచ్ వేశాడు. తన ఫుడ్ స్టాల్ లో పనిచేసే వంటవాడు, మరో వ్యక్తి సహాయంతో... పంకజ్ శవాన్ని తన ఫుడ్ స్టాల్ లో పాతి పెట్టాడు. దాదాపు పది అడుగుల లోతు తవ్వి అందులో 50కేజీల ఉప్పు పోసి.. అందులో పంకజ్ శవంతోపాటు.. బైక్ ని కూడా వేసి పూడ్చి పెట్టాడు. ముందుగా పంకజ్ శవాన్ని ఓ స్టీల్ డ్రమ్ములో పెట్టి.. తర్వాత ఆ ఉప్పులో ఈ డబ్బా పెట్టి పాతేశాడు.

అనంతరం పంకజ్ సెల్ ఫోన్ తీసుకువెళ్లి.. రాజస్థాన్ వెళ్తున్న ఓ ట్రక్కులో పడేశాడు. అయితే... పంకజ్ కనిపించకుండా పోవడంతో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో ఫుడ్ స్టాల్  యజమాని అమర్ సింగ్ పై అనుమానం కలిగింది.

దీంతో.. అతని స్టాల్ కి పోలీసుల్లా కాకుండా సాధారణ కస్టమర్ లాగా వెళ్లి పరిశీలించారు. దీంతో వారికి కొన్ని ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. అతనితోపాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.  

click me!