ఫిలడెల్ఫియాలో కాల్పులు.. ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు..

Published : Jun 06, 2022, 07:46 AM IST
ఫిలడెల్ఫియాలో కాల్పులు.. ముగ్గురు మృతి, 11 మందికి గాయాలు..

సారాంశం

ఫిలడెల్ఫియాలో కాల్పులు కలకలం రేపాయి. రద్దీగా ఉన్న వీధుల్లో జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, 11మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో పోలీసులు స్పాట్ నుండి మ్యాగజైన్‌తో సహా రెండు హ్యాండ్‌గన్‌లు స్వాధీనం చేసుకున్నారు. 

ఫిలడెల్ఫియా : ఫిలడెల్ఫియాలోని ప్రముఖentertainment districtలో శనివారం అర్థరాత్రి కొంతమంది షూటర్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు వ్యక్తులు మరణించగా, కనీసం 11 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం రాత్రి 11:30 గంటలకు సెంట్రల్ ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్‌లో పోలీసు అధికారులు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు, వారికి బుల్లుట్ శబ్దాలు వినిపించాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులకు నడకదారిలో, వీధిలో అనేకమంది తుపాకీ గాయాలతో కనిపించారు. వెంటనే పోలీసులు సహాయ చర్యలు చేపట్టారని పోలీసు కమిషనర్ డేనియల్ అవుట్లా చెప్పారు.

ఇక మరొక అధికారి మాట్లాడుతూ వీధి చివర్లో ఒక వ్యక్తి కాస్త దూరంలో ఉన్న పెద్ద గుంపుపైకి తుపాకీతో కాల్చడం చూశానన్నారు. వెంటనే తానూ తన ఆయుధంతో అతనిమీద అనేకసార్లు కాల్పులు జరిపానని.. దీంతో అతను తుపాకీ అక్కడ పడవేసి పారిపోయాడని.. అయితే పారిపోయేముందు అతను గాయపడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

ముగ్గురు మృతుల్లో ఒకరు 34 ఏళ్ల గ్రెగొరీ జాక్సన్, ఇంకొకరు 27 ఏళ్ల అలెక్సిస్ క్విన్ గా గుర్తించారు. మూడో వ్యక్తి 22 ఏళ్ల అతడిని గుర్తించలేదు. మరణించిన ముగ్గురిలో ఒకరు మరొకరితో ఘర్షణకు దిగారని అనుమానిస్తున్నారు. ఆ ఇద్దరే ఒకరిపై ఒకరు కాల్పులు జరపడం ప్రారంభించారని తెలుస్తోంది. ఈ ఘటనలో చనిపోయిన వారిలో, గాయపడిన వారిలో 17 నుండి 69 సంవత్సరాల వయస్సుగల వారు ఉన్నారు. ఇద్దరి మధ్య ఏర్పడిన ఘర్షణలు అమాయకులు ప్రాణాలు విడిచారు.

ఇది డార్క్ డే అని.. అస్సలు ఊహించని, భయంకరమైన చర్య అని పోలీసులు అంటున్నారు. ఘటనాస్థలినుంచి రెండు హ్యాండ్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ఒకటి ఎక్స్ టెండెడ్ మ్యాగజైన్‌తో ఉంది. అయితే చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఫ్రాంక్ వానోర్ మాట్లాడుతూ, మొత్తం ఐదు తుపాకులు ఈ క్రైంలో వాడినట్లు సంఘటనా స్థలంలో సాక్ష్యాల ద్వారా తెలుస్తుందన్నారు. అంతకుముందు జరిగిన కాల్పుల ఘటనలకు వీటికి సంబంధం ఉందా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. 

థామస్ జెఫెర్సన్ యూనివర్శిటీ హాస్పిటల్ లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఆదివారం రాత్రి ఆ ప్రాంతంలో, అలాగే పెన్స్ ల్యాండింగ్ ఏరియాలో వనరులను పెంపొందించేందుకు పోలీసులు ప్లాన్ చేశారని అన్నారు. సౌత్ స్ట్రీట్ అనేక బార్‌లు, రెస్టారెంట్లు, వ్యాపారాలతో వినోదానికి కేంద్రంగా, నైట్ లైఫ్ అడ్డాగా ప్రసిద్ధి చెందింది.  అక్కడి స్థానిక టీవీ రిపోర్ల ప్రకారం.. నడుచుకుంటూ వెడుతున్న వారిమీద కాల్పులు జరగడంతో భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. 

ఈ ఘటనపై మేయర్ జిమ్ కెన్నీ స్పందిస్తూ.. కాల్పుల ఘటన "వినాశకరమైనది" అన్నారు. ఈ ఘటన దిగ్భ్రాంతికి గురి చేసిందని చనిపోయిన వారికి తన సంతాపం తెలియజేశారు. దేశవ్యాప్తంగా తుపాకీ సంస్కృతి పెరగడం మీద ఆందోళన వ్యక్తం చేశారు. గన్స్ ఈజీగా దొరకడం చిన్న విషయాలకే కాల్పులు జరపడం.. చంపడం అంత మంచి విషయం కాదన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం