మహిళపై కౌన్సిలర్ దాడి..ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నంలో దారుణం..

Published : Jun 06, 2022, 06:36 AM ISTUpdated : Jun 06, 2022, 06:37 AM IST
మహిళపై కౌన్సిలర్ దాడి..ఎన్టీఆర్  జిల్లా ఇబ్రహీం పట్నంలో దారుణం..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లో ఓ కౌన్సిలర్ తన భర్తతో కలిసి ఓ మహిళ ఇంట్లోకి వెళ్లి మరీ దాడి చేసింది. ఆ ఘటన సీసీటీవీలో నమోదయ్యింది. 

NTR District : ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నం 17వ వార్డు కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి, ఆమె భర్త రమేష్. ఓ మహిళపై  attackకి పాల్పడ్డారు. నేరుగా ఇంట్లోకి వెళ్లి మరీ దాడి చేశారు. అయితే ఈ దృశ్యాలన్నీ CC TV cameraలో రికార్డయ్యాయి. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో social mediaలో హల్ చల్ చేస్తోంది. మహిళపై దాడికి కారణమేంటన్నది ఇంకా తెలియరాలేదు. 

కాగా, ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో తరచుగా కనిపిస్తున్నాయి. జూన్ 1న nalgonda జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మిర్యాలగూడలో ఓ Congress Councilor వీరంగం సృష్టించాడు. కౌన్సిలర్ జానీ అండ్ గ్యాంగ్ ముగ్గురు యువకులను చితకబాదిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. స్థానిక వెంకటేశ్వర థియేటర్ లో  సినిమా చూసేందుకు కౌన్సిలర్ జానీ బంధువులు వెళ్లారు. అదే సమయంలో మరో ముగ్గురు యువకులు కూడా సినిమా చూస్తున్నారు. 

ఈ క్రమంలో లో ఓ సమయంలో జానీ బంధువు, సదరు యువకులు(నాగరాజు, సతీష్, సాయి తేజ)ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.  దీంతో ఈ విషయాన్ని ఆ వ్యక్తి కౌన్సిలర్ జానీకి తెలియజేశాడు. తన బంధువుతోనే గొడవకు దిగుతారా? అంటూ జానీ తన గ్యాంగ్ ని తీసుకొని థియేటర్ వద్దకు వచ్చి హల్ చల్ చేశాడు. అంతటితో ఆగకుండా.. జానీతో పాటు వచ్చిన 20 మందితో కూడిన గ్యాంగ్ కలిసి ముగ్గురు యువకులపై దాడి చేశారు. వారి దాడిలో నాగరాజు తీవ్రంగా గాయపడగా వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఈ దాడికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. 

ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్ లో మే 19న తనను వేధిస్తున్న YCP Councilor మీద వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. Sri Sathyasai District పెనుకొండ పట్టణంలో బుధవారం ఈ ఘటన జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు కౌన్సిలర్ శేషాద్రి కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. ఆమె భర్తను Liquorనికి బానిసచేసి, తరచుగా ఇంటివద్దకు వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. అర్థరాత్రి ఇంటి తలుపు కొట్టడం, రాళ్లు విసరడం చేస్తున్నాడు. 

దీంతో విసిగిపోయిన బాధితురాలు పదిరోజుల క్రితం శేషాద్రిని పెనుగొండ ఆర్టీసీ బస్టాండు వద్ద చెప్పుతో కొట్టింది. అయినా అతడి తీరులో మార్పు రాలేదు. అతడి వికృత చేష్టలు భరించలేక బాధితురాలు బుధవారం  పెనుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వేధింపులు ఆపకపోతే ఆత్మహత్యే శరణ్యమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బాధితురాలు ఫిర్యాదు చేశారని, విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ రమేష్ బాబు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?