వడొదరలో కుప్ప కూలిన భవనం: ముగ్గురు మృతి

By telugu teamFirst Published 29, Sep 2020, 7:37 AM
Highlights

గుజరాత్ లోని వడొదరలో ఓ భవనం కుప్పకూలింది. మంగళవారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.

వడొదర: గుజరాత్ రాష్ట్రంలోని వడొదరలో ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో కనీసం ముగ్గురు మరణించారు వడొదరలోని భవన్ పురా ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం సంభవించింది.

మృతుల్లో ఇద్దరు ఓ మహిళ, ఓ పురుషుడు ఉన్నారు. గాయపడిన ఓ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. 18 ఏళ్ల యువకుడిని సహాయక బృందాలు రక్షించాయి.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు..

Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.

Last Updated 29, Sep 2020, 7:37 AM