కాశ్మీర్‌లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపిన ఉగ్రవాదులు

Siva Kodati |  
Published : Oct 29, 2020, 10:44 PM IST
కాశ్మీర్‌లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలను కాల్చి చంపిన ఉగ్రవాదులు

సారాంశం

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కుల్గాంలోని వైకే పొరా గ్రామంలో భాజపా కార్యకర్తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు కార్యకర్తలు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. 

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కుల్గాంలోని వైకే పొరా గ్రామంలో భాజపా కార్యకర్తలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు కార్యకర్తలు మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు.

సమాచారం అందుకున్న కుల్గాం సీనియర్‌ పోలీస్‌ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు తెలిపిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. కారులో ప్రయాణిస్తున్న భాజపా కార్యకర్తలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయాలపాలైన వారిని చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందారు.

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారిలో వైకే పొరాకు చెందిన ఫైదా హుస్సేన్‌ యాతో, ఉమర్‌ రంజాన్‌లు కాగా.. సోపాట్‌ దేవసర్‌కు చెందిన ఉమర్‌ రషీద్‌ బేగ్‌ ఉన్నట్టు గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.   

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే