కొత్త సంవత్సర ఆనందం ఆవిరి.. ఢిల్లీ, హర్యానాల్లో భూ ప్రకంపనలు.. భయంతో జనం పరుగులు.. 

By Rajesh KarampooriFirst Published Jan 1, 2023, 5:43 AM IST
Highlights

హర్యానాలోని ఝజ్జర్‌లో 3.8 తీవ్రతతో భూకంపం నమోదైంది, కొత్త సంవత్సరం మొదటి రోజు ఆదివారం ఉదయం ఢిల్లీ మరియు పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు నమోదయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది.

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఆనందోత్సాహాలతో ఉన్న ఢిల్లీ, పరిసర ప్రాంతాల ప్రజల ఆనందం ఓ సారిగా ఆవిరైపోయింది. కొత్త సంవత్సరం తొలి రోజైన ఆదివారం అర్థరాత్రి ఢిల్లీతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ సమాచారం ఇవ్వలేదు.

హర్యానాలో భూకంపం 

హర్యానాలోని ఝజ్జర్‌లో 3.8 తీవ్రతతో భూకంపం నమోదైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అర్థరాత్రి 1:19 గంటల సమయంలో భూకంపం సంభవించింది. భూకంప కేంద్రం భూమికి 5 కిలోమీటర్ల దిగువన నమోదయ్యానట్టు సమాచారం. దీని కారణంగా చాలా మంది ఈ భూకంపం ప్రభావాన్ని ఎదుర్కొన్నారు. రోహ్తక్-ఝజ్జర్ గుండా వెళుతున్న మహేంద్రగఢ్-డెహ్రాడూన్ ఫాల్ట్ లైన్ దగ్గర తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. దీనిపై నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ కూడా ప్రత్యక్ష కన్ను వేసింది.

ఇదే భూకంపానికి కారణం

డెహ్రాడూన్ నుండి మహేంద్రగఢ్ వరకు భూమి కింద ఒక ఫాల్ట్ లైన్ ఉంది. అందులో చాలా పగుళ్లు ఉన్నాయి. ఈ పగుళ్లలో ఈ రోజుల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దీని కింద ప్లేట్లు కదులుతాయి. ఒకదానితో ఒకటి తేలికగా ఢీకొన్నప్పుడే కంపనం ఏర్పడుతుంది. ఇది ఎప్పుడైనా ఎక్కడైనా జరగవచ్చు. దీని కారణంగా, భూకంపం ప్రకంపనలు సంభవిస్తాయి.  

సీస్మిక్ జోనింగ్ మ్యాప్ ప్రకారం..రోహ్‌తక్-ఝజ్జర్ జోన్ III , జోన్ IVలో వస్తుంది. భారతదేశంలో భూకంపాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఇందులో జోన్ రెండు, మూడు, నాలుగు మరియు ఐదు ఉన్నాయి. ఇది ప్రమాదాలను బట్టి కొలుస్తారు. జోన్ 2 అతి తక్కువ ప్రమాదకరమైనది , జోన్ 5 అత్యంత ప్రమాదకరమైనది. మ్యాప్‌లో జోన్ 2 ను నీలం రంగు లో.. జోన్ 3 పసుపు రంగులో .. జోన్ 4 నారింజ రంగులో  జోన్ 5 ఎరుపు రంగులో సూచించబడుతుంది. అయితే.. రోహ్‌తక్ జిల్లాలోని ఢిల్లీ వైపు ప్రాంతం జోన్ నాలుగులో , హిసార్ వైపు ప్రాంతం జోన్ మూడులో వస్తుంది. దీంతో తరుచు భూప్రకంపనాలు ఏర్పడుతుంటాయి. 

click me!