30 మంది సిఎంల్లో 29 మంది కోటీశ్వరులు.. వైఎస్ జగన్ టాప్, దీదీ అత్యల్పం

Published : Apr 12, 2023, 04:26 PM ISTUpdated : Apr 12, 2023, 04:29 PM IST
30 మంది సిఎంల్లో 29 మంది కోటీశ్వరులు.. వైఎస్ జగన్ టాప్, దీదీ అత్యల్పం

సారాంశం

New Delhi:  దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులుగా ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్ర‌కారం 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది అంటే 97 శాత  కోటీశ్వరులు ఉన్నారు. ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తులు రూ.33.96 కోట్లుగా ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.  

Association for Democratic Reforms (ADR) Report: దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులుగా ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్ర‌కారం 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది అంటే 97 శాత  కోటీశ్వరులు ఉన్నారు. ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తులు రూ.33.96 కోట్లుగా ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది. 

వివ‌రాల్లోకెళ్తే.. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విశ్లేషించిన ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం 30 మంది ప్రస్తుత ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులు ఉన్నారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అత్యధికంగా రూ.510 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. అయితే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆస్తులు అత్యల్పంగా రూ.15 లక్షలుగా ఉన్నాయనీ, ఆమె కోటీశ్వ‌రులైన ముఖ్య‌మంత్రులు జాబితాలో చోటుద‌క్కించుకోలేద‌ని  ఏడీఆర్ తెలిపింది.

ప్రస్తుత 30 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల స్వీయ ప్రమాణ స్వీకార ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించిన తర్వాత తాము ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఏడీఆర్, ఎలక్షన్ వాచ్ (న్యూ) తెలిపాయి. 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరిలో కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన జ‌మ్మూకాశ్మీర్ కు ప్రస్తుతం ముఖ్యమంత్రి లేరు. 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది (97 శాతం) కోటీశ్వరులేనని, ఒక్కో ముఖ్యమంత్రి సగటు ఆస్తులు రూ.33.96 కోట్లుగా ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.

ఏడీఆర్ నివేదిక ప్రకారం, 30 మంది ముఖ్యమంత్రుల్లో 13 మంది (43 శాతం) హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపులతో సహా తీవ్రమైన క్రిమినల్ కేసులు త‌మ‌పై ఉన్న‌ట్టు ప్రకటించారు. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఐదేళ్లకు పైగా జైలు శిక్ష పడే నాన్ బెయిలబుల్ నేరాలు అని నివేదిక తెలిపింది. ఏడీఆర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (రూ.510 కోట్లకు పైగా), అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన పెమా ఖండూ (రూ.163 కోట్లకు పైగా), ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్ (రూ.63 కోట్లకు పైగా) ఆస్తుల‌లో టాప్ లో ఉన్నారు.

ఆస్తుల‌ను అత్యల్పంగా ప్రకటించిన ముగ్గురు ముఖ్యమంత్రులలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (రూ .15 లక్షలకు పైగా), కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (రూ .1 కోటికి పైగా), హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ (రూ .1 కోటికి పైగా) ఉన్నార‌ని ఏడీఆర్ తెలిపింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లకు రూ.3 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Udhayanidhi Stalin Speech: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఉదయనిధి స్టాలిన్ సూపర్ స్పీచ్| Asianet Telugu
Nitish Kumar Takes Oath in Rajya Sabha: రాజ్యసభలో నితీశ్ కుమార్ ప్రమాణం | Asianet News Telugu