తహవూర్ రాణా: 26/11 కుట్రదారుడి కస్టడీ 12 రోజులు పొడిగింపు

Published : Apr 28, 2025, 04:41 PM IST
తహవూర్ రాణా:  26/11 కుట్రదారుడి కస్టడీ 12 రోజులు పొడిగింపు

సారాంశం

ఢిల్లీ కోర్టు సోమవారం 26/11 ముంబై దాడుల నిందితుడు తహవూర్ హుస్సేన్ రాణా కస్టడీని  12 రోజులు పొడిగించింది. రాణా NIA కస్టడీలో మరో 12 రోజులు ఉంటాడు.

ఢిల్లీ కోర్టు సోమవారం 26/11 ముంబై దాడుల నిందితుడు తహవూర్ హుస్సేన్ రాణా NIA కస్టడీని 12 రోజులు పొడిగించింది. 18 రోజుల NIA కస్టడీ ముగిసిన తర్వాత, భారీ భద్రత నడుమ, ముఖం కప్పి, తహవూర్ హుస్సేన్ రాణాను ప్రత్యేక NIA న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ ముందు హాజరుపరిచారు.

ఇటీవలే అమెరికా భారత్ కు తహవూర్ హుస్సేన్ రాణా ను అప్పగించింది. సోమవారం ప్రత్యేక NIA కోర్టులో హాజరుపరిచారు. సీనియర్ న్యాయవాది దయన్ కృష్ణన్ నేతృత్వంలోని కేంద్ర దర్యాప్తు సంస్థ న్యాయ బృందం కోర్టులో హాజరైంది.

 

 

ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ అధికారులు తహవూర్ హుస్సేన్ రాణా ఢిల్లీలోని NIA కార్యాలయంలో ప్రశ్నించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.

ముంబై పోలీసు అధికారుల ప్రకారం, బుధవారం తహవూర్ హుస్సేన్ రాణాను ఎనిమిది గంటలపాటు ప్రశ్నించగా, అతను దాటవేద సమాధానాలు ఇచ్చి సహకరించలేదు.

ఉగ్రవాదంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థానీ-కెనడియన్ పౌరుడు, మాజీ మిలిటరీ డాక్టర్ తహవూర్ హుస్సేన్ రాణాను ఇటీవలే అమెరికా నుండి భారత్ కు తీసుకొచ్చారు

మరోవైపు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు, తన కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడేందుకు అనుమతి కోరుతూ తహవూర్ హుస్సేన్ రాణా దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

ప్రత్యేక NIA న్యాయమూర్తి చందర్ జిత్ సింగ్ గురువారం అతని పిటిషన్ ను కొట్టివేశారు. కస్టడీలో తనకు ఎలాంటి చికిత్స అందుతోందో తెలుసుకోవాలని తన కుటుంబం ఆందోళన చెందుతున్నందున, విదేశీ పౌరుడిగా తన కుటుంబంతో మాట్లాడే హక్కు తనకు ఉందని రాణా న్యాయవాది పియుష్ సచ్దేవా వాదించారు.

అయితే, NIA ఈ అభ్యర్థనను వ్యతిరేకించింది. దర్యాప్తు కొనసాగుతున్నందున, రానా సున్నితమైన సమాచారాన్ని బయటపెట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

రాణాపై భారతీయ శిక్షాస్మృతి, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నిరోధక) చట్టం (UAPA) కింద కుట్ర, ఉగ్రవాదం, ఫోర్జరీ, యుద్ధం చేయడం వంటి అనేక అభియోగాలు నమోదయ్యాయి. అప్పగింత ఒప్పందంలో ప్రత్యేకంగా పేర్కొన్న నేరాలకు మాత్రమే అతడిని విచారణ చేయవచ్చని కోర్టు పేర్కొంది.

UAPAలోని సెక్షన్ 16, 18 వర్తిస్తున్నందున, కేసు ఉగ్రవాద సంబంధితమైనది కాబట్టి, ప్రామాణిక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) పరిమితులకు మించి పోలీసు కస్టడీని పొడిగించవచ్చు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu