యూనివర్సిటీ ఫెస్ట్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 26 ఏళ్ల యువకుడు.. మృతి

Published : Feb 25, 2023, 01:48 PM IST
యూనివర్సిటీ ఫెస్ట్‌లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన 26 ఏళ్ల యువకుడు.. మృతి

సారాంశం

కర్ణాటకలో ఓ యూనివర్సిటీ కాలేజ్ ఫెస్ట్‌లో డ్యాన్స్ చేస్తూ 26 ఏళ్ల స్టూడెంట్ హఠాత్తుగా ప్రాణాలు కోల్పోయాడు. డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. సకాలంలో వైద్య సహాయం అందించినప్పటికీ మరణించాడు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.  

బెంగళూరు: కర్ణాటకలో అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ఫెస్టివల్‌లో డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఓ స్టూడెంట్ కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత మరణించాడు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. డ్యాన్స్ చేస్తూ కుప్పలికూలిన తర్వాత వెంటనే ట్రీట్‌మెంట్ అందించినా ఆ 26 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలువలేవు.

ఎంఏ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అభిజిత్ షిండే డ్యాన్స్ ఈవెంట్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. కాలేజ్ ఫెస్ట్ ఓపెనింగ్ ఈవెంట్‌లో అతను శుక్రవారం డ్యాన్స్ చేశాడు. డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయాడు. ఆ విద్యార్థి గురించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేవు. అయితే, అతను మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందినవాడని పోలీసులు వివరించారు. శనివారంనాటికి అతని పేరెంట్స్ వచ్చే అవకాశం ఉన్నదని, అప్పటి వరకుు లీగల్ యాక్షన్ నిలిపేసినట్టు చెప్పారు. 

ఈ ఘటనపై తాను కలత చెందుతున్నామని యూనివర్సిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతి యేటా నిర్వహించే కాలేజ్ ఫెస్ట్ ఓపెనింగ్ సెరెమొనీలో అతడు డ్యాన్స్ చేశాడని, డ్యాన్స్ చేస్తూనే కుప్పకూలిపోయాడని వివరించింది. అతడికి వెంటనే వైద్య సహాయం అందించామని తెలిపింది. అయినా.. అతని ప్రాణాలు దక్కలేవని పేర్కొంది. ఆ ప్రకటనలో వర్సిటీ యాజమాన్యం అతని బంధు మిత్రులకు సానుభూతి తెలిపింది.

Also Read: యూపీ ఎమ్మెల్యే మర్డర్ కేసులో ప్రధాన సాక్షి దారుణ హత్య.. పట్టపగలే నడి రోడ్డుపై కాల్చివేత.. (వీడియో)

క్యాంపస్‌లో నిరసనలు జరుగుతున్నాయి. క్యాంపస్ నుంచి హాస్టల్ వరకు తీసుకెళ్లే షటిల్ బస్ టికెట్ ధరలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ స్టూడెంట్లు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తొలి రోజు మాత్రమే షిండే పాల్గొన్నాడని, ఆ తర్వాత ఫిబ్రవరి 23, 24వ తేదీల్లో అతను హంగర్ స్ట్రైక్‌లో లేడని వర్సిటీ తెలిపింది.

PREV
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం