తనని తానే పెళ్లి చేసుకున్న యువతి.... 24గంటల్లో విడాకులు..!

Published : Mar 14, 2023, 09:34 AM IST
తనని తానే పెళ్లి చేసుకున్న యువతి.... 24గంటల్లో విడాకులు..!

సారాంశం

25 ఏళ్ల సోఫీ మౌర్ ఫిబ్రవరిలో తనను తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. వైట్ బ్రైడల్ గౌనులో ఉన్న కొన్ని చిత్రాలను కూడా ఆమె ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

క్షమా బిందు... ఈ పేరు ఎక్కడైనా విన్నట్లు ఉందా..? తనని తానే పెళ్లి చేసుకున్న యువతి పేరు అది. నిజానికి ఓ అమ్మాయి ఎవరైనా అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. స్వలింగ సంపర్కురాలు అయితే... మరో అమ్మాయిని పెళ్లాడుతుంది. అయితే... ఈ అమ్మాయి మాత్రం ఎవరూ వద్దు అని.. తనని తాను పెళ్లి చేసుకుంది. ఆమె పెళ్లి పెద్ద సంచలనం కూడా అయ్యింది. పెళ్లి తర్వాత తాను గోవాకి హనీమూన్ కి వెళ్తున్నానంటూ కూడా ఆమె ప్రకటించింది. అయితే... ఆమెను ఆదర్శంగా తీసుకొని మరో యువతి కూడా తనని తాను పెళ్లి చేసుకుంది. అయితే.. ఆమె క్షమా బిందు లాగా ఉండలేకపోయింది. పెళ్లి చేసుకున్న 24 గంటలకే.. విడాకులు కావాలంటూ కూర్చుంది. 

 

పూర్తి వివరాల్లోకి వెళితే....25 ఏళ్ల సోఫీ మౌర్ ఫిబ్రవరిలో తనను తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. వైట్ బ్రైడల్ గౌనులో ఉన్న కొన్ని చిత్రాలను కూడా ఆమె ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

"ఈ రోజు, నా జీవితంలో అత్యంత ఆనందమైన క్షణాలు. నన్ను నేను పెళ్లి చేసుకోవడానికి వివాహ దుస్తులు కొనుక్కున్నాను. నాతో పెళ్లికి నేనే స్వయంగా... కేకు కూడా తయారు చేసుకున్నాను " అని ఆమె క్యాప్షన్ కూడా పెట్టింది.

ఆమె పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఆమెకు చాలా మంది విషెస్  చెప్పారు. సూపర్ అంటూ కొందరు ప్రశంసించారు. ఆమె పెళ్లి ఫిబ్రవరి 20వ తేదీ జరిగింది. అయితే.... ఆ తర్వాత కొన్ని రోజులకే తాను విడాకులు తీసుకున్నానంటూ ఆమె పోస్టు పెట్టడం విశేషం.

కేవలం పెళ్లి చేసుకున్న 24 గంటలకే ఆమెకు విడాకులు తీసుకోవాలన్న ఆలోచన వచ్చింది. తాను ఆ బంధం లో ఉండలేకపోయిందట. అందుకే... విడాకులకు అప్లై చేసినట్లు ఆమె చెప్పడం విశేషం.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

UPI Update : ఫోన్ పే, గూగుల్ పే నుండి తెలియని నంబర్లకు డబ్బులు పంపితే .. ఏం చేయాలో తెలుసా?
Top 5 Biggest Railway Stations : ఏ ముంబై, డిల్లీలోనో కాదు.. దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?