
Budho Mata temple : ప్రసాదం పేరిటి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆలయం వద్ద అందించిన పండ్ల రసం తాగి 25 మంది స్పృహతప్పి పడిపోయారు. స్థానికులు వేంటనే వీరిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందనీ, ఎలాంటి అనుకోని ఘటనలు జరగలేదని వైద్యులు తెలిపారు. ఈ ఘటన గురుగ్రామ్ లోని ఆలయం చోటుచేసుకుంది. పండ్ల రసం అందించిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. గురుగ్రామ్ (Gurugram )లోని ఫరూఖ్ నగర్ ప్రాంతంలోని బుధో మాత ఆలయం (Budho Mata temple)లో జాతరకు చాలా మంది భక్తులు వచ్చారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి ప్రసాదం పేరుతో వచ్చిన భక్తులు పండ్ల రసం అందిస్తూ.. జాతరలో తిరుగుతున్నాడు. అయితే, ఈ పండ్ల రసం తాగిన 25 మంది స్పృహతప్పి పడిపోయారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని స్థానికలు వెల్లడించారు. దీని గురించి స్థానిక అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు, స్థానికులు వెంటనే వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు బాగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి భక్తులకు ప్రసాదం పేరుతో అందించిన ఈ పానీయంలో మత్తు మందు కలిపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. "బాధితులను బుధవారం ఉదయం ఆస్పత్రిలో చేర్చారు. కోలుకున్న తర్వాత వారిని డిశ్చార్జ్ చేశారు. అయితే, ఈ ఘటన నేపథ్యంలో ఎలాంటి దోపిడీ లేదా దొంగతనం సంబంధించినవి నివేదించబడలేదని పోలీసులు తెలిపారు. ఈ పండ్ల రసం అందించిన వ్యక్తిని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.
ఫరూఖ్‌నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సునీల్ బెనివాల్ మాట్లాడుతూ.. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 328, 336, 120-బి కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. గుడి ఆవరణలో గుర్తుతెలియని వ్యక్తి పండ్ల రసాన్ని ప్రసాదంగా పేర్కొంటూ ఇక్కడకు వచ్చినవారికి అందించాడని చెప్పారు. ఈ కేసు ఫిర్యాదుదారుల్లో ఒకరైన ఢిల్లీ నివాసి సుశీల్ కుమార్ తన కుటుంబంతో సహా ఆలయానికి వచ్చారు. జరిగిన ఘటన గురంచి ఆయన మాట్లాడుతూ.. “ఒక వ్యక్తి వచ్చి గ్లాసుల్లో పండ్ల రసాన్ని అందించినప్పుడు మేము మా కారు నుండి దిగాము. ఇది తాను అందించిన 'ప్రసాదం' అని మరియు అందరికీ అందిస్తున్నానని చెప్పాడు. "నా భార్య మరియు నా మేనకోడలు జ్యూస్ తాగిన తర్వాత స్పృహ తప్పి పడిపోయారు. ఇతర వ్యక్తులు కూడా స్థానికంగా ఏడుపు విన్నాము, వారు కూడా ఆ వ్యక్తి అందించిన పండ్ల రసం తాగి ఉండవచ్చు" అని పేర్కొన్నాడు.