రాహుల్ గాంధీ మీ సమస్యేంటి..? మండిపడ్డ కేంద్ర మంత్రి

By telugu news teamFirst Published Jul 2, 2021, 12:43 PM IST
Highlights

జులై నెలలో కరోనా వ్యాక్సిన్ డోస్ ల గురించి తాను ముందే ట్వీట్ చేశానని.. దానిని చదవకపోవడం రాహుల్ గాంధీ పొరపాటు అంటూ పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు.

దేశంలో కరోనా మహమ్మారి ఎంతలా విజృంభించిందో మనందరికీ తెలిసిందే. అయితే.. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తోంది. అయితే.. పలు ప్రాంతాల్లో వ్యాక్సిన్ నిల్వలు  తక్కువగా ఉంటున్నాయి.  ఈ నేపథ్యంలో.. ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో.. రాహుల్ గాంధీపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్థన్  మండిపడ్డారు. జులై నెలలో కరోనా వ్యాక్సిన్ డోస్ ల గురించి తాను ముందే ట్వీట్ చేశానని.. దానిని చదవకపోవడం రాహుల్ గాంధీ పొరపాటు అంటూ పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు.

‘‘ నిన్ననే.. నేను జులై నెలలో కరోనా వ్యాక్సిన్ లభ్యత గురించి ట్వీట్ చేశాను. రాహుల్ గాంధీ మీ సమస్య ఏంటి..? మీరు ట్వీట్ చూడలేదా..? లేక చదవడం రాదా..? ఇలాంటి అర్థం లేని ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు. అహంకారం, అజ్ఞానానికి ఎలాంటి టీకా ఉండదు. రాహుల్ న్యాయకత్వంపై కాంగ్రెస్ మరోసారి ఆలోచించుకోవాలి’’ అంటూ హర్షవర్థన్ బదులు ఇచ్చారు.

కాగా.. గత వారం కూడా రాహుల్ గాంధీ.. వ్యాక్సిన్ కొరత గురించి ప్రధాని మోడీకి ఉద్దేశిస్తూ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో మధ్యప్రదేశ్  సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. అబద్దాలు చెప్పి.. ప్రజలను గందరోగళానికి గురిచేయవద్దని ఆయన రాహుల్ పై మండిపడటం గమనార్హం.

జూలైలో 12 కోట్ల మోతాదులను రాష్ట్రాలకు పంపిస్తామని డాక్టర్ వర్ధన్ గురువారం చెప్పారు; ఇందులో ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయా అనేది అస్పష్టంగా ఉంది 
 

click me!