
భోపాల్ : Madhya Pradeshలోని జిల్లాలోని ఝుబువా జిల్లాలోని ఫుల్ గవాడి గ్రామంలో 212 గిరిజన కుటుంబాలకు చెందిన 300 మంది Christianity నుంచి Hinduismలోకి తిరిగి వచ్చారని
Vishwa Hindu Parishad కార్యకర్త ఆజాద్ ప్రేమ్ సింగ్ దామోర్ చెప్పారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ హిందూ సంస్కృతిని ప్రచారం చేయడంతో పాటు మతం మారిన వారు తిరిగి వచ్చేలా ప్రతిజ్ఞ చేయాలని ప్రజలను కోరారు. దీంతో విహెచ్ పీ ఘర్ వాపసీకి మూడు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఆరునెలలుగా క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా దామోర్ ప్రచారం చేశారు. మెరుగైన వైద్య, ఆరోగ్య సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి 300 మందిని క్రైస్తవ మతంలోకి చట్టవిరుద్ధంగా మార్చారని దామోర్ ఆరోపించారు. క్రైస్తవ మతాన్ని స్వీకరించడం ద్వారా తమ పూర్వీకులను అవమానిస్తున్నారని వారు సమావేశం నిర్వహించిన క్రమంలో.. 300 మందిని హిందూ మతంలోకి గ్రహించారని స్థానిక నివాసి రాకేష్ భూరియా చెప్పారు. అంతేకాదు తిరిగి హిందూ మతంలోకి మారడానికి అంగీకరించిన 212 కుటుంబాల జాబితా తమ వద్ద ఉందని తెలిపారు. మూడు రోజులుగా గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో హవనాలు, పూజలు నిర్వహిస్తున్నామని.. వివరించారు
ఇదిలా ఉండగా, మతమార్పిడులను తీవ్రంగా పరిగణించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిరుడు మార్చి 8న కీలక ముందడుగు వేసింది.పెళ్లి పేరుతో లేదా ఇతర మోసపూరిత కారణాలతో జరుగుతున్న మత మార్పిడులకు చెక్ పెట్టే బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ మార్చి 8న ఆమోదం తెలిపింది. 2020, డిసెంబర్‌లో ఇదే అంశంపై రాష్ట్ర కేబినెట్ తీసుకొచ్చిన ఓ ఆర్డినెన్స్‌కు చట్టరూపు ఇచ్చింది.
‘మధ్య ప్రదేశ్ మతస్వేచ్ఛ బిల్లు- 2021’ పేరుతో 2021,మార్చి నెల 1న రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ ముగిసిన అనంతరం మూజువాణి ఓటుతో ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ చట్టం ప్రకారం నిబంధలు ఉల్లంఘించిన వారికి పదేళ్ల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా సైతం విధిస్తారు. కాగా మత మార్పిడి నిరోధక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన నెల రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో ఈ తరహా 23 కేసులు నమోదైనట్టు గత నెలలో హోంమంత్రి వెల్లడించారు.
కాగా, 2020 డిసెంబర్ 29న మత మార్పిడి నిరోధక ఆర్డినెన్స్‌కు మధ్య ప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. పెళ్లి ముసుగులో కానీ, మోసపూరితంగా రాతై ఎవరైనా మత మార్పిడికి పాల్పడితే ఈ ఆర్డినెన్స్ కింద పదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. ‘మత స్వేచ్ఛ బిల్లు-2020’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్‌ను గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ఆమోదం కోసం పంపినట్టు రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా పేర్కొన్నారు.
‘‘సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన 2020 డిసెంబర్ 29న జరిగిన వర్చువల్ కేబినెట్ మీటింగ్‌లో మత స్వేచ్ఛ ఆర్డినెన్స్ సహా పలు ఆర్డినెన్స్‌లను ఆమోదించడం జరిగింది...’’ అని ఆయన పేర్కొన్నారు. కొవిడ్-19 కారణంగా అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడడంతో ఈ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టలేకపోయామని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్ లో ఈ ఆర్డినెన్స్ అమల్లో ఉంది. యూపీ మంత్రివర్గం 2020 నవంబర్ 24న చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ - 2020కు ఆమోదం తెలిపింది. ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆనందిబెన్ పటేల్ నవంబర్ 28న ఆమోదముద్ర వేశారు.