
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలోనూ(Private Sector) రిజర్వేషన్లు (Reservation) ఉండాలని, స్థానికులకే 75 శాతం (Local Candidates) ఉద్యోగాలు ఇవ్వాలనే తమ చట్టంపై హైకోర్టు (High Court) ఇచ్చిన స్టేను సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం (Haryana Govt) సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలోని బెంచ్‌ను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహెతా కోరబోతున్నట్టు తెలిసింది. తమ రాష్ట్రంలోని ప్రైవేటు కంపెనీలు తప్పకుండా 75 శాతం ఉద్యోగులు స్థానికులు ఇవ్వాలనే నిబంధనలతో హర్యానా ప్రభుత్వం ఓ చట్టాన్ని తెచ్చింది.
హర్యానా స్టేట్ ఎప్లాయ్‌మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ 2020 జనవరి 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం, ప్రైవేటు సెక్టార్‌లోని ఉద్యోగాల్లో 75 శాతం హర్యానా ప్రజలకు ఇచ్చి తీరాలని ప్రభుత్వం ఆదేశించింది. నెలవారి జీతం 30వేల లోపు తీసుకునే ఉద్యోగాలకు ఈ నిబంధన వర్తిస్తుంది. ప్రైవేటు కంపెనీలు, ట్రస్టులు, భాగస్వామ్యం కింద నిర్వహించే కంపెనీలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఇందులో 30వేల జీతంలోపు ఉండే ఉద్యోగాలకు ఈ చట్టం అమలు అవుతుంది. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, ఈ ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలకు ఈ నిబంధనలు వర్తించవు.
కాగా, ఈ చట్టంపై ప్రైవేటు కంపెనీలు అగ్గిమీద గుగ్గిళం అవుతున్నాయి. ఇది రాజ్యాగానికే విరుద్ధమైన చట్టం అని వాదిస్తున్నాయి. ఒక వ్యక్తి ఏ రాష్ట్రంలోనైనా ఉపాధి వెతుక్కునే హక్కు కలిగి ఉంటాడని చెబుతున్నాయి. అంతేకాదు, కంపెనీలకు, వాటి యాజమాన్యాలకు రాజ్యాంగం కల్పిస్తున్న హక్కులనూ కాలరాస్తున్నదని అంటున్నాయి. ఇలాంటి చట్టాలు కంపెనీల మధ్య పోటీతత్వాన్ని దెబ్బతీస్తాయని, ఈ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని హర్యానాలోని పారిశ్రామిక సంఘాలు పేర్కొన్నాయి. అందులో భాగంగానే గుర్గావ్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ పంజాబ్, హర్యానా హైకోర్టులో ఓ పిటిషన్ వేసింది.
ఇక్కడ పుట్టిన వారి భూమి అంటూ పేర్కొంటున్న ఈ చట్టాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. ఈ చట్టం యాజమాన్యాలకు ఉండే రాజ్యాంగబద్ధమైన హక్కులను ఉల్లంఘిస్తున్నదని పేర్కొంది. ప్రైవేటు ఉద్యోగాలు పూర్తిగా ఒక వ్యక్తికి ఉన్న నైపుణ్యాలు, మేధోపరమైన సామర్థ్యం ఆధారంగానే ఉంటాయని వివరించింది. అలాగే, దేశవ్యాప్తంగా ఎక్కడైనా ఉపాధి వెతికి చేసుకునే హక్కు భారత పౌరులకు ఉన్నదని తెలిపింది. ఈ వాదనలతోనే పారిశ్రామిక సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ కోర్టు వాదనలు విన్న తర్వాత ఈ చట్టంపై స్టే విధించింది. తాజాగా, హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించంది.
ఇదిలా ఉండగా, రాహుల్ గాంధీ ప్రసంగ ప్రకంపనలు హర్యానాలోనూ కనిపించాయి. ‘రెండు భారత్’లు అంటూ కాంగ్రెస్ (congress) ఎంపీ రాహుల్ గాంధీ (rahul gandhi) చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ (anil vij) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ పుట్టుక ఆధారంగానే ఆయన ఆలోచనలు ఉంటున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఇటలీ తల్లి, ఇండియన్ తండ్రి అడుగుజాడల్లో పెరిగిన గాంధీ వారసుడికి.. ఒకటే భారత్ కు బదులు రెండు భారత్ లు కనిపిస్తున్నాయంటూ అనిల్ విజ్ అన్నారు. అందుకే ఆ రెండు దేశాల సంస్కృతులూ రాహుల్ కు ఒంటబట్టాయని.. అందుకేనేమో అతడి ఆలోచనల్లోనే ఏదో తేడా ఉంటోంది’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.