యేడాది క్రితం తల్లిమీద అత్యాచారం.. అదే చోట కూతురు ఆత్మహత్య.. మిస్టరీగా మారిన యువతి మరణం...

Published : Jan 04, 2023, 01:17 PM IST
 యేడాది క్రితం తల్లిమీద అత్యాచారం.. అదే చోట కూతురు ఆత్మహత్య.. మిస్టరీగా మారిన యువతి మరణం...

సారాంశం

తండ్రికి దూరంగా ఉండలేకపోతున్నానంటూ ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే తల్లిమాత్రం కూతురిమీద ప్యాక్టరీ యజమాని కూతుర్ని లోబరుచుకుని చంపేశాడని ఆరోపిస్తోంది. 

ఛత్తీస్ గఢ్ :చత్తీస్ ఘడ్ లోని బలోద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొత్త సంవత్సరానికి అందరూ ఎంతో సంతోషంగా ఆహ్వానం పలుకుతున్న వేళ.. ఇరవై ఒక్క ఏళ్ల యువతి మాత్రం తన జీవితానికి చరమగీతం పాడింది. తాము ఉంటున్న ప్రాంగణంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏడాది క్రితం తల్లిపై అత్యాచారం జరిగిన స్థలంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. తల్లిపై అత్యాచార ఘటన తర్వాత ఆ యువతి ఒంటరిదైపోయింది. ఆ ఘటనతో తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. కుటుంబం చిన్నాభిన్నం అయింది. ఆత్మహత్య చేసుకున్న యువతి దగ్గర ఓ సూసైడ్ నోట్ కూడా లభించింది.

చత్తీస్ ఘడ్ లోని బలోద్ జిల్లాలోని మొహదీపట్ లో ఉన్న ఢాకా అండ్ ఢాకా ఫ్యాక్టరీలో ఈ ఘటన జరిగింది. ఆ ఫ్యాక్టరీలో ఇనుము తయారీ పనులు జరుగుతాయి.  21 ఏళ్ల యువతి జనవరి ఒకటో తేదీ ఉరికి వేలాడుతూ మృతదేహంగా కనిపించింది. ఈమేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఉరి నుంచి దింపి పోస్టుమార్టంకు తరలించారు. ఆ యువతి తన సోదరుడితో కలిసి ఫ్యాక్టరీ ఆవరణలో ఉంటుంది. బీఎస్సీ చదువుకుంటోంది. 

బలవంతంగా బట్టలు విప్పించారు.. బెంగళూరు విమానాశ్రయంలో ఓ మహిళకు చేదు అనుభవం..

ఆమె తల్లి కూడా ఏడాది క్రితం వరకు అదే ఫ్యాక్టరీలో పని చేసింది. ఫ్యాక్టరీ యజమాని విజయ్ ఢాకా ఏడాది క్రితం ఆమె మీద అత్యాచారం చేశాడు. దీని మీద ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విజయ్ ఢాకా  జైలుకి కూడా వెళ్ళాడు. ఈ ఘటన తర్వాత మృతురాలి తల్లి అయిన బాధిత మహిళ వేరే చోటికి మకాం మార్చింది. ఆ ఘటనతో ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు. పిల్లలిద్దరినీ తల్లిదండ్రులు పట్టించుకోవడం మానేశారు. దీంతో వీరిద్దరూ ఫ్యాక్టరీ ఆవరణలోనే ఉంటున్నారు. 

తల్లిదండ్రులు విడిపోవడంతో.. ఒంటరిగా ఉండాల్సి వస్తుందని..  తండ్రికి దూరంగా ఉండలేకపోతున్నాను.. అని మృతురాలు సూసైడ్ నోట్ లో ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు  సూసైడ్ నోట్ రాసి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. అయితే, కూతురు ఆత్మహత్య మీద బాధితురాలైన తల్లి వేరే రకంగా ఆరోపిస్తోంది. తనపై అత్యాచారానికి పాల్పడిన యజమానే ఆమెను హత్య చేశాడని చెబుతోంది. 

విజయ్ ఢాకా అరెస్టై, జైలు నుంచి విడుదలైన తరువాత.. తన కూతురు మీద కన్నేశాడని చెప్పింది.  అలా తన కూతురిని లోబరుచుకున్నాడు అని తెలిపింది. ఈ విషయం బయట పడుతుందనే.. తన కూతురును చంపేసిన ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఈ కేసులో దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు చెబుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !
కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు