కోవిడ్ రోగి అంత్యక్రియలకు హాజరు... ఒకరి తర్వాత మరొకరిగా, 21 మంది మృతి

By Siva KodatiFirst Published May 8, 2021, 6:01 PM IST
Highlights

దేశంలో కోవిడ్ విలయతాండవం కొనసాగున్నప్పటికీ.. నిబంధనలు పాటించాలని కేంద్రప్రభుత్వం పలు మార్లు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజల్లో మాత్రం నిర్లక్ష్యం పోవడం లేదు. తాజాగా కోవిడ్ సోకి మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు చేసిన 21 మంది వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు

దేశంలో కోవిడ్ విలయతాండవం కొనసాగున్నప్పటికీ.. నిబంధనలు పాటించాలని కేంద్రప్రభుత్వం పలు మార్లు విజ్ఞప్తి చేస్తున్నా ప్రజల్లో మాత్రం నిర్లక్ష్యం పోవడం లేదు. తాజాగా కోవిడ్ సోకి మరణించిన వ్యక్తికి అంత్యక్రియలు చేసిన 21 మంది వైరస్ బారినపడి మృత్యువాత పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని శిఖర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. అయితే, ఈ ఘటనలో నలుగురు మాత్రమే కరోనాతో చనిపోయారని, మిగతా వారు వివిధ కారణాలతో మరణించారని అధికారులు చెబుతున్నారు.

ఏప్రిల్ 21న కరోనాతో మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని స్వగ్రామమైన ఖీర్వా గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు, గ్రామస్తులు ఇలా 150 మంది అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Also Read:పాజిటివ్ రిపోర్ట్ లేకున్నా.. నాన్ లోకల్ అయినా చేర్చుకోవాల్సిందే: ఆసుపత్రులకు కేంద్రం కొత్త గైడ్‌లైన్స్

నిజానికి కరోనా సోకిన వ్యక్తి మృతదేహానికి ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటించి దహన సంస్కారాలు నిర్వహించాల్సి ఉంది. కానీ గ్రామస్తులు అలాంటివేమీ లేకుండానే క్రతువు నిర్వహించారు.

ఈ ఘటన తర్వాతి నుంచి ఈ నెల 5వ తేదీ మధ్యకాలంలో ఖీర్వా గ్రామంలో ఏకంగా 21 మంది కరోనాతో మృతి చెందారు. వారందరూ అంత్యక్రియల్లో పాల్గొన్నవారే కావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. అయితే, అధికారులు మాత్రం అందులో నాలుగు మరణాలు మాత్రమే కొవిడ్ సంబంధమైనవని, మిగతావి ఇతర కారణాల వల్ల సంభవించిన మరణాలని పేర్కొన్నారు.

అయితే వారు కోవిడ్ వల్ల మరణించారో లేదో తెలుసుకునేందుకు ఆయా కుటుంబాలకు చెందిన 147 మంది నుంచి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. మరోవైపు గ్రామంలో కొన్ని రోజుల వ్యవధిలో 21 మంది మరణించడంతో అధికారులు వూరంతా శానిటైజేషన్ డ్రైవ్ నిర్వహించారు. 

click me!