
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో జరిగిన 18 హింసాత్మక సంఘటనలలో 21 మందిని అరెస్టు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సిఇఒ) గిత్తె కిరణ్‌కుమార్ దినకరరావు తెలిపారు. గురువారం జరిగిన ఎన్నికల్లో రాష్ట్రంలో 89.95 శాతం ఓటింగ్ నమోదైందని తెలిపారు. ఫిబ్రవరి 16 నుండి 18 వరకు రాష్ట్రాలోని పలు చోట్ల హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయనీ, వాటికి తదనుగుణంగా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని తెలిపారు. హింసలో పాల్గొన్న ఆరోపణలపై 150 మందికి పైగా వ్యక్తులకు నోటీసులు అందజేయగా మొత్తం 21 మందిని అరెస్టు చేశారు.
త్రిపురలో పోలింగ్ రోజు జరిగిన ఆరు ఘటనలు జరిగాయని సీఈవో గిత్తె కిరణ్‌కుమార్ దినకరరావు తెలిపారు. ఇందులో సెపాహిజాలా జిల్లాలో ఎక్కువ ఘటనలు నమోదయ్యాయని ఆయన చెప్పారు. అదేసమయంలో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు ఈసారి బాగా తగ్గాయని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలోని అన్ని సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్లు శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.
రాష్ట్రంలోని అన్ని సబ్ డివిజన్ మెజిస్ట్రేట్‌లు శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారని, శాంతిని నెలకొల్పేందుకు సహకరించాలని ఆయన కోరారు. ఇద్దరు బిజెపి అభ్యర్థులు -- గోలఘటి నియోజకవర్గానికి చెందిన హేమానీ దెబ్బర్మ , మాతాబరి నుండి ప్రణజిత్ సిన్హా రాయ్ -- కొన్ని బూత్‌లలో రీపోలింగ్ చేయాలని ఆరోపణలు వస్తున్నట్టు తెలిపారు.
అయితే..ఆ బూత్‌లలో వెబ్‌కాస్టింగ్ ఫుటేజీని పరిశీలించిన తర్వాత ఆరోపణలను తిరస్కరించారు. మరోవైపు శనివారం ఉనకోటి జిల్లాలోని కుమార్‌ఘాట్‌లో బీజేపీ, లెఫ్ట్-కాంగ్రెస్ మద్దతుదారులు ఘర్షణకు దిగి హైవేను దిగ్బంధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌తో పాటు కొంతమందికి గాయాలయ్యాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించినట్లు తెలిపారు.