గోద్రా అల్లర్ల వెనుక కుట్ర లేదు: మోడీకి నావావతి కమిషన్ క్లీన్ చీట్

By Siva KodatiFirst Published Dec 11, 2019, 3:49 PM IST
Highlights

2002లో సంచలనం సృష్టించిన గోద్రా రైలు దహనం తర్వాత జరిగిన అల్లర్ల కేసులో నరేంద్రమోడీ నేతృత్వంలోని నాటి గుజరాత్ ప్రభుత్వానికి క్లీన్ చిట్ లభించింది. 

2002లో సంచలనం సృష్టించిన గోద్రా రైలు దహనం తర్వాత జరిగిన అల్లర్ల కేసులో నరేంద్రమోడీ నేతృత్వంలోని నాటి గుజరాత్ ప్రభుత్వానికి క్లీన్ చిట్ లభించింది. మోడీ ప్రభుత్వానికి ఇందులో ఎలాంటి సంబంధం లేదని నానావతి-మెహతా కమిషన్ తెలిపింది. ఈ మేరకు గుజరాత్ అసెంబ్లీకి బుధవారం కమీషన్ నివేదిక సమర్పించింది. ఆ అల్లర్లు ఒకరి ఆధ్వర్యంలో జరిగినవి కావని తేల్చి చెప్పింది. 

మూడు రోజుల పాటు సాగిన హింసను పోలీసులు ఏమాత్రం నియంత్రించలేకపోయారని కమిషన్ అభిప్రాయపడింది. అప్పుడు విధుల్లో ఉన్న పోలీసు అధికారులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో కానీ, ప్రేరణతో కానీ ఈ ప్రమాదం జరగలేదని కమిషన్ స్పష్టం చేసింది.

Also read:Nirbhaya case : దోషులు తీహార్ జైలుకు,త్వరలోనే ఉరి?

2002 ఫిబ్రవరి 27న అల్లరి మూకలు సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలుకు నిప్పు పెట్టడంతో ఎస్-6 కోచ్‌లో ఉన్న 59 మంది కరసేవకులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన కారణంగా గుజరాత్‌లో పెద్ద ఎత్తున మత ఘర్షణలు చెలరేగి, 1000 మంది వరకు ప్రాణాలు కోల్పోగా... వీరిలో అత్యధికులు ముస్లింలే. 

ఈ అల్లర్లపై నాటి గుజరాత్ సీఎం నరేంద్రమోడీ రిటైర్డ్ జస్టిస్‌లు నానావతి, అక్షయ్ మెహతాలతో విచారణ కమిటీని నియమించారు. బుధవారం ఈ నివేదికను రాష్ట్ర హోంమంత్రి ప్రదీప్‌సిన్హ్ జడేజా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

కాగా ఎస్-6 కోచ్‌ను పరిశీలించడానికి వెళ్లిన మోడీ ‘‘సాక్ష్యాలను నాశనం చేయడానికే గోద్రా వెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా గోద్రా సందర్శించారని మోడీపై వచ్చిన ఆరోపణలను కమిషన్ ఖండించింది.

Also Read:ఫడ్నవీస్, అజిత్ ముచ్చట్లు : రాజకీయాలు కాకుండా.. వాతావరణం గురించి చర్చించారట

సాధారణ స్థితిని పునరుద్ధరించేలా సీనియర్ అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా తాను నిరంతరాయంగా పరిస్ధితిని సమీక్షించారని నివేదిక పేర్కొంది. ఆర్‌బీ శ్రీకుమార్, సంజీవ్ భట్, రాహుల్ శర్మ అనే ముగ్గురు ఐపీఎస్ అధికారుల పాత్ర మాత్రం ప్రతికూలంగా ఉందని కమిషన్ వెల్లడించింది.

1,500 పేజీల ఈ నివేదికలో అల్లర్లలో హింసను ప్రేరేపించడంలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోడీ, అతని మంత్రివర్గంలోని ఏ సభ్యుడి ప్రమేయం ఉన్నట్లు ప్రత్యక్ష ఆధారాలు లేవని పేర్కొంది. 

click me!