బైక్ రేసులో కిందపడి బైకర్ మృతి.. రెండేళ్ల తరువాత షాకింగ్ నిజాలు వెలుగులోకి..

By AN TeluguFirst Published Sep 28, 2021, 11:04 AM IST
Highlights

బెంగళూరుకు చెందిన అస్బక్ మోన్ అనే వ్యక్తికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ పోటీలు నిర్వహించిన తప్పక పాల్గొనేవాడు.  2018 లో రాజస్థాన్ లోని జైసల్మీర్ లో బైక్ రేసింగ్ పోటీలు ఉన్నాయంటే వెళ్లాడు.  కానీ ప్రమాదవశాత్తు అతను కిందపడిపోయి మరణించాడు.  

రాజస్థాన్ : బైక్ రేసు(Bike Race)లో పాల్గొని ప్రమాదవశాత్తు కిందపడిపోవడంతో బైకర్ (Biker) మరణించాడనుకున్నారు(death) అందరు. కానీ బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు(Police) ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెడితే....

బెంగళూరుకు చెందిన అస్బక్ మోన్ అనే వ్యక్తికి బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కడ పోటీలు నిర్వహించిన తప్పక పాల్గొనేవాడు.  2018 లో రాజస్థాన్ లోని జైసల్మీర్ లో బైక్ రేసింగ్ పోటీలు ఉన్నాయంటే వెళ్లాడు.  కానీ ప్రమాదవశాత్తు అతను కిందపడిపోయి మరణించాడు.  

ఈ విషయాన్ని అక్కడి పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అస్బక్ భార్య, తండ్రి బెంగళూరు నుంచి జైసల్మేర్ కు వచ్చారు.  అక్కడే పోస్టుమార్టం నిర్వహించి, దహనసంస్కారాలు పూర్తి చేశారు.

కానీ, ఇది గడిచిన రెండేళ్లకు బంధువులకు అనుమానం వచ్చింది. ఎందుకంటే వారికి అతని మీద, అతని బైక్ రైడింగ్ మీద చాలా నమ్మకం ఉండేది.  ఎలాంటి పోటీలో నైనా కింద పడిపోకుండా నడపగలిగే సత్తా   అస్బక్  కు ఉందని వారి నమ్మకం.  దీంతో ప్రమాదం మీద తమకు అనుమానం ఉందని ఇందులో ఏదో పెద్ద కుట్ర దాగి ఉందని బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గర్భిణీపై గ్యాంగ్ రేప్ చేసి.. రైలు పట్టాలపై పడేసి..!

దీంతో కేసు రీఓపెన్ చేసిన పోలీసులు.. ప్రమాదం జరిగిన ప్రాంతం  జైసల్మేర్ కాబట్టి.. బెంగళూరు పోలీసులు  ఆ ప్రాంత పోలీసుల సహాయం కోరారు.  కేసును సీరియస్ గా  పరిగణించి దర్యాప్తు చేయగా  పోలీసులకు కూడా ఇది హత్య అనే అనుమానమే కలిగింది.  

వారి దర్యాప్తులో చివరికి.. ఇది  కుట్రేనని,  ఇందులో అస్బక్ స్నేహితుల హస్తం ఉందని తేలింది. అయితే కేసు రీఓపెన్ అయిన సంగతి, దర్యాప్తు జరుగుతున్న సంగతి అర్థమై అస్బక్  స్నేహితులు పారిపోయారు. దీంతో పోలీసులు  బెంగుళూరు, కేరళలో తనిఖీలు నిర్వహించి సంజయ్ కుమార్, విశ్వాస్ అనే వ్యక్తులను సోమవారం అరెస్టు చేశారు. అస్బక్ ను చంపడం వెనక  కారణాలు  ఏంటో  త్వరలోనే కనుక్కుంటామని పోలీసులు వెల్లడించారు. 
 

click me!