Asianet News TeluguAsianet News Telugu

గర్భిణీపై గ్యాంగ్ రేప్ చేసి.. రైలు పట్టాలపై పడేసి..!

ఆమెను అనుసరించిన ఇద్దరు యువకులు గర్భిణీ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం ఆమె నోటిని గట్టిగా మూసేసి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. 

Pregnant woman molested in Bihar
Author
Hyderabad, First Published Sep 28, 2021, 8:29 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వాకింగ్ కోసం వెళ్లిన ఓ గర్భిణీపై మానవ మృగాళ్ల కన్ను పడింది. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  అనంతరం ఆమెను రైలు పట్టాలపై పడేసి వెళ్లిపోయారు. ఈ సంఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

24ఏళ్ల మహిళ శనివారం రాత్రి తన ఇంటి సమీపంలో వాకింగ్ కి వెళ్లింది. ఆమెను అనుసరించిన ఇద్దరు యువకులు గర్భిణీ పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అనంతరం ఆమె నోటిని గట్టిగా మూసేసి సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. అనంతరం మరో వ్యక్తిని పిలిచి ముగ్గురూ ఒకరి తర్వాత ఒకరు దారుణానికి పాల్పడ్డారు.

ఆమె ప్రతిఘటించడంతో దాడి చేశారు. దీంతో స్పృహ కోల్పోయిన ఆమెను రైల్వే ట్రాక్ పై పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆమెకు స్పృహ వచ్చింది. గట్టిగా కేకలు వేయడంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు ఆమెను కాపాడి పోలీస్ సట్ేషన్ కు తీసుకువెళ్లారు. అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు చేసి వాంగ్మూలాన్ని రికార్డు  చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు  చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఇద్దరు నిందితులను అరెస్టు చేసి.. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios