పుల్వామాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Published : Mar 05, 2019, 11:19 AM IST
పుల్వామాలో ఎన్ కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

సారాంశం

జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య మంగళవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి.

జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య మంగళవారం ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు.. భారత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సోదాలు చేపట్టారు.

ఈ క్రమంలో ఉగ్రవాదులు ఉన్న స్థావరాన్ని గుర్తించి.. దానిపై  దాడి చేశారు. ఇప్పటికి ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. మరికొందరు అదే ప్రాంతంలో సంచరిస్తున్నట్లు సమాచారం. దీంతో భద్రతా బలగాలు సోదాలు కొనసాగిస్తున్నారు. 

ఫిబ్రవరి 14నాటి ఆత్మాహుతి దాడి తరవాత పుల్వామాలో హై అలర్ట్‌ విధించారు. ఆ ప్రాంతంలో మొబైల్‌, ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారు. గత వారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు భద్రతా సిబ్బంది, ఓ పౌరుడు మరణించిన విషయం తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu