బెంగాల్ లో ఉగ్రవాద కార్యకలపాలు.. ఇద్దరు ఐఎస్‌ఐఎస్‌ టెర్రరిస్టుల అరెస్టు..

By Rajesh KarampooriFirst Published Jan 7, 2023, 10:51 PM IST
Highlights

కోల్‌కతా పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) పశ్చిమ బెంగాల్‌లోని హౌరా లో ఐసిస్‌తో అనుమానిత సంబంధాలున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్టు చేసింది. అరెస్టయిన ఇద్దరిని ఎండీ సద్దాం (28), సయీద్ (30)గా గుర్తించారు. వీరిని జనవరి 19 వరకు పోలీసు కస్టడీకి పంపారు.

పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో ఇద్దరు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను కోల్‌కతా పోలీసుల స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టిఎఫ్)అరెస్టు చేసింది. వీరికి కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో సంబంధం ఉన్నట్లు సమాచారం. సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నుండి అందిన రహస్య సమాచారం ఆధారంగా.. ఎస్‌టిఎఫ్ బృందం శుక్రవారం రాత్రి నిందితులిద్దరినీ టికియాపాడలోని అఫ్తాబుద్దీన్ మున్షీ లేన్‌లోని వారి రహస్య స్థావరంలో శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టయిన  ఇద్దరిని ఎండీ సద్దాం (28), సయీద్ (30)గా గుర్తించారు. వీరిని శనివారం కోర్టులో హాజరుపరిచారు. ఈ సమయంలో జనవరి 19 వరకు పోలీసు రిమాండ్‌కు తరలించారు.

ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో వీరిద్దరినీ అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి పలు ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డ్రైవ్‌లు, పెన్ డ్రైవ్‌లు, సీపీయూ, నోట్‌బుక్‌లు, డైరీ, ఆయుధాలు, డెబిట్ కార్డులు, మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కథనాలు, పత్రాలలో వివిధ జిహాదీ కంటెంట్, జిహాదీ ఛానెల్‌ల జాబితా , కంపెనీల “సందేహాస్పద పేర్ల” జాబితాను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.  

ఎస్‌టిఎఫ్ బృందం శుక్రవారం రాత్రి హౌరా జిల్లాలో దాడులు నిర్వహించి, తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడినందుకు సయ్యద్‌ను అరెస్టు చేసింది. సదామ్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో అతని అరెస్ట్ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  ప్రభుత్వ వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర పన్నినందుకు వారిని అరెస్టు చేశారు. వీరిద్దరూ ప్రభుత్వాన్ని పడగొట్టి ఖలీఫా రాజ్యాన్ని ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇద్దరూ కలిసి హౌరాలో వ్యక్తులను దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ప్రేరేపించినట్టు ఆరోపణలున్నాయి.

వీరిద్దరు మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలను సేకరించడంతోపాటు తీవ్రవాద కార్యకలాపాలకు నిధులు సేకరించడంలో కూడా పాలుపంచుకున్నారని పోలీసులు తెలిపారు. హౌరాలోని అఫ్తాబుద్దీన్ మున్షీ లేన్‌లో నివాసం  ఉంటున్న సదమ్‌ను గతంలో అరెస్టు చేశారు. వీరిద్దరినీ శనివారం కోల్‌కతాలోని బ్యాంక్‌షాల్ కోర్టులో హాజరుపరచగా, జనవరి 19 వరకు పోలీసు కస్టడీకి పంపారు.

click me!