హర్యానా హోం మంత్రికి యాక్సిడెంట్.. సురక్షితంగానే మంత్రి

Published : Jan 07, 2023, 08:07 PM IST
హర్యానా హోం మంత్రికి యాక్సిడెంట్.. సురక్షితంగానే మంత్రి

సారాంశం

హర్యానా హోం మంత్రి అనిల్ విజ్‌ కాన్వాయ్‌ను ఓ ట్రక్ ఢీకొట్టింది. ట్రక్ ఢీకొట్టిన ఎస్‌యూవీ.. ముందు ఉన్న మంత్రి కారు సెడాన్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హోం మంత్రికి గాయాలేవీ కాలేవని, ఆయన సురక్షితంగానే ఉన్నాడని విశ్వసనీయ వర్గాలు వివరించాయి.  

న్యూఢిల్లీ: హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ కాన్వాయ్‌‌ను ఓ ట్రక్ ఢీకొట్టింది. కుండ్లీ - మనేసర్- పల్వాల్ ఎక్స్‌ప్రెస్ వే పై శనివారం ఈ ప్రమాదం జరిగింది. కాన్వాయ్ వెనుక వైపు నుంచి ఈ ట్రక్ ఢీకొట్టినట్టు విశ్వసనీయ వర్గాలు వివరించాయి. ఈ ప్రమాదంలో హర్యానా హోం మంత్రి అనిల్ విజ్ సురక్షితంగానే ఉన్నట్టు తెలిపాయి.

హోం మంత్రి అనిల్ విజ్ వెంట ఉన్న కాన్వాయ్‌లోని  ఎస్‌యూవీని ట్రక్ ఢీకొట్టింది. దీంతో ఆ ఎస్‌యూవీ పట్టుతప్పి ముందున్న మంత్రి అనిల్ విజ్ ప్రయాణిస్తున్న సెడాన్ కారును ఢీకొట్టింది.

హర్యానా మోం మంత్రి సురక్షితంగానే, గాయపడకుండానే ఉన్నట్టు తెలిసింది.

Also Read: కాంగ్రెస్ పార్టీలోనే రావణుడు దాగి ఉన్నాడు: ఖర్గే వ్యాఖ్యలపై విరుచుకపడ్డ హర్యానా హోం మంత్రి

ఈ యాక్సిడెంట్‌ను హర్యానా మంత్రి అనిల్ విజ్ ధ్రువీకరించారు. ట్రక్ డ్రైవర్ ఇయర్ ప్లగ్స్‌తో డ్రైవ్ చేస్తున్నట్టు వివరించారు. సెక్యూరిటీ సిబ్బంది అంతా సురక్షితంగానే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అంబాలాలోని తన నివాసానికి వస్తున్నట్టు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !