వీళ్ల తెలివి తగలెయ్యా... కోతులతో దొంగతనం

Published : Apr 13, 2021, 07:43 AM IST
వీళ్ల తెలివి తగలెయ్యా... కోతులతో దొంగతనం

సారాంశం

తాజాగా కొందరు దొంగలు తమ చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేస్తున్నారు. దొంగతనం చేస్తారు.. కానీ అది డైరెక్ట్ గా వాళ్లు చేయరు. వాళ్లు పెంచుకుంటున్న కోతులు చేస్తాయి.

దొంగలు.. చోరీలు చేసేందుకు ఎవోవే ప్లాన్లు వేస్తూ ఉంటారు. దొంగతనం చేసిన తర్వాత కూడా పోలీసులకు దొరకకుండా ఉండేంుదకు వారు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా కొందరు దొంగలు తమ చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేస్తున్నారు. దొంగతనం చేస్తారు.. కానీ అది డైరెక్ట్ గా వాళ్లు చేయరు. వాళ్లు పెంచుకుంటున్న కోతులు చేస్తాయి. కోతులు తెచ్చిన సొమ్ముతో వీరు జల్సా చేసుకుంటారు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కోతులు దొంగతనాలకు పాల్పడుతున్నాయి. పలువురి వద్ద ఉన్న సొమ్మును కోతులు చోరీ చేశాయి. కాగా.. తాజాగా ఓ వ్యక్తి రోడ్డుపై వెళుతుండగా అతని వద్ద నుంచి ఓ ముఠా రూ.6వేల నగదు కాజేసింది. వారి వద్ద కోతులు కూడా ఉండటాన్ని బాధితుడు గమనించాడు.

దీంతో.. తనకు ఎదురైన సంఘటనతోపాటు.. ఆ ప్రాంతంలో గత కొంతకాలంగా కోతులు దొంగతనం చేయడం లాంటి విషయాలు తెలిసి ఉంటంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోతులతో ప్లాన్ ప్రకారం దొంగతనాలు చేయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి వద్ద ఉన్న కోతులను కూడా అదుపులోకి తీసుకొని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఈ ముఠాలో ఇంకా కొందరి హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..