బాలికపై అత్యాచారం.. కామాంధులకు 20యేళ్ల జైలు..

Published : Apr 07, 2021, 01:30 PM IST
బాలికపై అత్యాచారం.. కామాంధులకు 20యేళ్ల జైలు..

సారాంశం

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు కామాంధులకు 20 సంవత్సరాల జైలు శిక్ష, 25 వేల జరిమానా విధిస్తూ మైసూరు జిల్లా ఒకటవ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు కామాంధులకు 20 సంవత్సరాల జైలు శిక్ష, 25 వేల జరిమానా విధిస్తూ మైసూరు జిల్లా ఒకటవ సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చింది.

మైసూరులోని ఎన్‌.ఆర్‌.మోహల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న జై శివ మహదేవ్ (55) కైసర్‌ పాషా (33) అనే వ్యక్తులు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.  

బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులను ఎస్‌.ఆర్‌.మొహల్లా పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసు విచారణకు రాగా నిందితుల నేరం రుజువైంది. దీంతో శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.

ఇదిలా ఉండగా యశ్వంతపుర లో నాలుగు రోజుల కిందట కొడగు జిల్లా పొన్నంపేట తాలూకా నాకూరు సమీపంలోని ముగుచికేరి గ్రామంలో ఒక వ్యక్తి బామ్మర్ది ఇంటి పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు మొత్తంగా బావమర్ది కుటుంబంలో ముగ్గురు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.

కాగా ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి కూడా మృతిచెందాడు. అతడి మృతదేహాన్ని సమీపంలోని కాఫీ తోటల్లో పోలీసులు కనుగొన్నారు. ఈ నెల 3న  పెట్రోల్ పోసి హత్యాకాండకు పాల్పడిన నిందితుడు ఎరవర జోజ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

ఘటన జరిగినప్పటినుంచి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇప్పుడు అతడు కూడా ప్రాణాలు విడవడంతో కేసు మిస్టరీగానే మిగిలిపోయింది. ఎందుకు హత్యాకాండకు పాల్పడ్డాడనే విషయం బయటపడే అవకాశం లేకపోయింది.

PREV
click me!

Recommended Stories

తమిళనాడు అసంబ్లీలో గందరగోళం | Udhayanidhi Stalin vs Aadhav Arjuna | CM Vijay | Asianet News Telugu
మాటలకందని విషాదం.. కోచింగ్ సెంటర్‌లో అగ్ని ప్ర‌మాదం 14 మంది మృతి, బిల్డింగ్ నుంచి దూకిన విద్యార్థులు