దారుణం: మంత్రాల నెపంతో ఇద్దరిని కొట్టి చంపిన గ్రామస్తులు

By narsimha lodeFirst Published Oct 2, 2020, 10:24 AM IST
Highlights

 అసోం రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. మంత్రాలు(చేతబడి) నేర్చుకొంటున్నారనే  అనుమానంతో గ్రామస్తుల దాడితో ఇద్దరు మరణించారు. 


గౌహాతి: అసోం రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. మంత్రాలు(చేతబడి) నేర్చుకొంటున్నారనే  అనుమానంతో గ్రామస్తుల దాడితో ఇద్దరు మరణించారు. 

అసోం రాష్ట్రంలోని మారుమూల గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. బుధవారం నాడు రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది.  కానీ ఈ విషయం గురువారం నాడు ఉదయం వెలుగు చూసింది.

మృతి చెందిన ఇద్దరి  అవశేషాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ  కేసులో తొమ్మిది మంది గ్రామస్తును పోలీసులు అరెస్ట్ చేశారు.కర్బి అంగ్లాంగ్ జిల్లాలోని డోక్మా పోలీస్ స్టేషన్ పరిధిలో రోహిం పూర్  గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది.  ఈ గ్రామంలో ఓ మహిళ కొన్ని రోజుల క్రితం మృతి చెందింది.

గోహౌతికి వెళ్లి చికిత్స చేయించిన తర్వాత కూడ ఆమె మరణించింది.బుధవారం నాడు ఆ మహిళ అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలు పూర్తైన తర్వాత అదే గ్రామానికి చెందిన 50 ఏళ్ల వితంతు మహిళ అసాధారణంగా ప్రవర్తించిందని గ్రామస్తులు చెప్పారు.

ఈ గ్రామంలో ఆదివాసీలు,, చిన్న రైతులు, రోజు వారీ కూలీలు నివసిస్తున్నారు.గ్రామంలోని రమావతి అనే మంత్రాలు నేర్చుకొంటుందని స్థానికులు ఆరోపించారు. గ్రామంలో చోటు చేసుకొంటున్న ఘటనలకు ఆమె కారణమని గ్రామ పెద్దలు తీర్పు చెప్పారు.

వెంటనే గ్రామస్తులు మూకుమ్మడిగా రమావతిపై దాడి చేశారు. పదునైన ఆయుధాలు చేతబట్టి ఆమెను కొట్టారు. అయితే గ్రామానికి చెందిన 28 ఏళ్ల విద్యావంతుడైన యువకుడు బిజోయ్ గౌర్ ఈ ఘటనను తీవ్రంగా వ్యతిరేకించాడు. 

ఇవన్నీ మూఢనమ్మకాలంటూ కొట్టిపారేశాడు. రమావతిపై దాడిని అతను అడ్డుకొనేందుకు ప్రయత్నించాడు. అతనిపై కూడ గ్రామస్తులు దాడికి దిగారని పోలీసులు చెప్పారు.

గ్రామస్తులు ఇద్దరిని చనిపోయే వరకు కొట్టిచంపారు. మృతదేహాలకు తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు.మృతదేహాలు తగులబెట్టిన చితి నుండి గురువారం నాడు ఉదయం మృతుల అవశేషాలను సేకరించినట్టుగా పోలీసులు చెప్పారు.

నిందితుల నుండి పదునైన ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నామని పోలీసులు తెలిపారు.  గ్రామానికి చెందిన 9 మందిని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు. ఇంకా కొందరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

చిన్న పిల్లలను అపహారించే ముఠాగా భావించిన గ్రామస్తులు ఇదే గ్రామంలో ఇద్దరిని 2018 లో కొట్టి చంపారని పోలీసులు  చెప్పారు.2018 నుండి అసోంలో మంత్రగాళ్ల వేట నివారణ, రక్షణ చట్టం 2015 అమల్లో ఉంది.

కొత్త చట్టం మేరకు మంత్రగాళ్ల పేరుతో దాడి నాన్ బెయిలబుల్ శిక్ష కిందకు వస్తాయి. ఈ కేసుల్లో జీవిత ఖైదు విధిస్తారు.
2015లో అసోం అసెంబ్లీ ఈ బిల్లును ఆమోదించింది.రాష్ట్రంలో 18 ఏళ్లలో మంత్రగాళ్ల వేట పేరుతో 161 మందిని చంపారని 2019లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీకి తెలిపింది.

click me!