రక్తమోడిన దేశ రాజధాని రహదారులు.. అదుపు తప్పిన కారు.. ఇద్దరు మృతి, పలువురి పరిస్థితి విషమం..

Published : Mar 09, 2023, 06:16 AM IST
రక్తమోడిన దేశ రాజధాని రహదారులు.. అదుపు తప్పిన కారు.. ఇద్దరు మృతి, పలువురి పరిస్థితి విషమం..

సారాంశం

న్యూఢిల్లీలోని మలై మందిర్ ప్రాంతంలో హృదయ విదారక సంఘటన జరిగింది. అతి వేగంగా వెళ్తున్న కారు విధ్వంసం స్రుష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా..పిల్లలతో సహా 8 మంది గాయపడ్డారు.

దేశ రాజధాని ఢిల్లీలోని బసంత్ విహార్ మలై మందిర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. అత్యంత వేగంగా వచ్చిన థార్(కారు) విధ్వంసం స్రుష్టించింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మిగిలిన వారు గాయపడ్డారు. మృతులను మున్నా, సమీర్‌గా గుర్తించారు. కారు వేగం చాలా ఎక్కువగా ఉండడంతో మరో రెండు వాహనాలను కూడా ఢీకొట్టింది. అతివేగం ఉండడంతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడని పోలీసులు చెబుతున్నారు.  
 
అసలేం జరిగిందంటే..? 

రాత్రి 7.30 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న కారు ముందుగా రోడ్డు డివైడర్‌కు ఉన్న స్తంభాన్ని ఢీకొట్టి అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కూరగాయలు, పండ్ల దుకాణంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. థార్ వాహనం కండిషన్ చూస్తే అది ఏ స్పీడ్ లో ఉంటుందో కూడా ఊహించవచ్చు. పోలీసు బృందం కూడా సంఘటనా స్థలానికి చేరుకుంది. 

క్షతగాత్రులను సమీపంలోని ఎయిమ్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం తదుపరి విచారణ జరుపుతోంది. అతివేగం ఉండడంతో డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు పలుమార్లు బోల్తా పడింది. కారు ఢీకొన్న వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒక థార్, 2- ఫోర్ వీలర్స్, మూడు వెండర్ స్టాళ్లు దెబ్బతిన్నాయని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ముండ్కా ప్రాంతంలో మరణహోమం..  ఇద్దరు మృతి, 7 మందికి గాయాలు

ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలోని ఫ్రెండ్స్ ఎన్‌క్లేవ్ సమీపంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటనలో 7 మందికి గాయాలయ్యాయి. ఈ సమాచారం మేరకు పోలీసులు ముండ్కాలోని ఫ్రెండ్స్ కాలనీలో ఉన్న డి-15ఎకు చేరుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పక్కనే ఉన్న లేన్‌లో నివసించే సోను , అభిషేక్ మధ్య ఇక్కడ గొడవ మొదలైంది. అభిషేక్ , అతని స్నేహితులు సోనుపై దాడి చేసి మధ్యవర్తులపై కూడా కత్తితో పొడిచారు. ఆ తర్వాత సోనూ వర్గంలోని వ్యక్తులు అభిషేక్‌ను కూడా కొట్టి కత్తితో పొడిచారు. ఘర్షణలో సోను,నవీన్ మరణించగా, అభిషేక్,  మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.  వారిని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ముగ్గురూ సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu