తండ్రి చనిపోయాడని తెలియక, శవం పక్కనే 3 రోజులుగా చిన్నారులు...!!

Published : Jun 17, 2021, 04:40 PM IST
తండ్రి చనిపోయాడని తెలియక, శవం పక్కనే 3 రోజులుగా చిన్నారులు...!!

సారాంశం

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా, భర్త ఉరివేసుకుని చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. నోయిడాలో మనోజ్ దయాల్ తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. అతను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 

ఉత్తరప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. భార్యభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా, భర్త ఉరివేసుకుని చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు.. నోయిడాలో మనోజ్ దయాల్ తన కుటుంబంతో కలిసి జీవించేవాడు. అతను ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. 

వీరికి 4,6 యేళ్ల వయస్సున్న ఇద్దరు ఆడపిల్లలు. కరోనా వలన గత కొన్ని రోజులుగా మనోజ్ దయాల్ ఇంటినుంచే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో తరచుగా గొడవలు జరిగేవి. దీంతో విసిగిపోయిన మనోజ్ భార్య ఇంటినుంచి వెళ్లిపోయింది. 

అప్పటినుంచి మనోజ్ తన ఇద్దరు బిడ్డలను చూసుకుంటున్నాడు. అయితే ఈ క్రమంలో కొన్ని రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో, ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, పాపం.. తండ్రి చనిపోయాడనే విషయం తెలియని ఆ బిడ్డలు, నాన్నకు ఎంత పిలిచినా పలకడం లేదని ఆకలి వేయడంతో ఇంటి నుంచి బయటకు వచ్చారు. 

అప్పటికే మూడు రోజుల నుంచి ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావడం లేదని చుట్టుపక్కల వారు అనుమానంగా చూశారు. ఇంతలోనే పిల్లలు బయటకు వచ్చి మానాన్న, మాట్లాడటం లేదని చుట్టుపక్కల వాళ్లకు తెలిపారు. 

దీంతో అనుమానం వచ్చిన స్థానికులు ఆ ఇంటికి వెళ్లి చూశారు. అయితే, అప్పటికే మనోజ్ ఆత్మహత్య చేసుకుని ఉన్నాడు. అతని శవం నుంచి దుర్వాసన వెలువడుతుంది. దీంతో చిన్నారులు మూడు రోజుల నుంచి శవంతోనే ఉన్నారని వారు భావించారు. 

వెంటనే అక్కడి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం బారేల్లీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. శవాన్ని వైద్యపరీక్షల కోసం తరలించారు. కాగా, కేసును నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతామని తెలిపారు. ఆ చిన్నారులిద్దరిని వారి బంధువులకు అప్పగించామని రోహిత్ సింగ్ అనే పోలీసు అధికారి పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్