అక్రమ సంబంధం... కారులో తుపాకీతో కాల్చుకొని ఇద్దరు డాక్టర్లు..

Published : Dec 05, 2019, 07:45 AM IST
అక్రమ సంబంధం... కారులో తుపాకీతో కాల్చుకొని ఇద్దరు డాక్టర్లు..

సారాంశం

ఆమె తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తేవడంతో... ఇద్దరి మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో.. ఆమెను హత్య చేసి.. తాను కూడా కాల్చుకున్నాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

అక్రమ సంబంధం ఇద్దరు డాక్టర్లు ప్రాణాలు పోవడానికి కారణమైంది. ఆ ఇద్దరూ వైద్యులే. ఒకే ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. అతనికి పెళ్లై భార్య ఉంది. కానీ... తాను పనిచేసే ఆస్పత్రిలోని మరో డాక్టర్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె తనను పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి తేవడంతో... ఇద్దరి మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో.. ఆమెను హత్య చేసి.. తాను కూడా కాల్చుకున్నాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఓం ప్రకాశ్ కుక్రీజా(65), సుదీప్తా ముఖర్జీ(55)అనే ఇద్దరు వైద్యులు ఢిల్లీలోని ప్రముఖ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. కాగా... గత కొన్ని సంవత్సరాలుగా వీరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. కాగా... తనను పెళ్లిచేసుకోవాల్సిందిగా సుదీప్తా... ఓం ప్రకాశ్ ని కోరింది. అందుకు ఆయన అంగీకరించకపోవడంతో.. ఇద్దరి మధ్యా ఘర్షణ చోటుచేసుకుంది.

బుధవారం ఉదయం ఇద్దరూ కారులో వెళ్తుండగా మరోసారి గొడవపడ్డారు. ఈ క్రమంలో ఓం ప్రకాశ్... తన దగ్గర ఉన్న తుపాకీతో ఆమె పై కాల్పలు జరిపాడు. అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీరిద్దరి మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు
IAF Recruitment : కేవలం ఇంటర్ అర్హతతో... ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ