నాలుగేళ్లుగా చెల్లెపై ఇద్దరు అన్నల అత్యాచారం

Published : Oct 18, 2018, 12:08 PM IST
నాలుగేళ్లుగా చెల్లెపై ఇద్దరు అన్నల అత్యాచారం

సారాంశం

మీరట్ లోని సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్ ప్రాంతంలో నివసించే పదిహేనేళ్ల వయస్సు గల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది.

మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ అత్యంత దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. తమ మైనర్ సోదరిపై ఇద్దరు సోదరులు నాలుగేళ్లకు పైగా అత్యాచారం చేస్తూ వస్తున్నారు. 

మీరట్ లోని సివిల్ లైన్స్ పోలీసు స్టేషన్ ప్రాంతంలో నివసించే పదిహేనేళ్ల వయస్సు గల బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. 

బాలిక ప్రతిఘటించినప్పుడు కొడుతూ వారు తమ కోరికను తీర్చుకుంటూ వచ్చారు. అమ్మను చంపేస్తామని బెదిరిస్తూ వచ్చారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. 

మరో సంఘటనలో 24 ఏళ్ల మహిళపై పొరుగున ఉండే వ్యక్తి అత్యాచారం చేశాడు. జిల్లాలోని కక్రోలీ గ్రామంలో నివసిస్తున్న మహిళ నిద్రిస్తున్న సమయంలో అతను ఇంట్లోకి ప్రవేశించాడు. 

తనను సమీపంలోని అటవీ ప్రాంతానికి బలవంతంగా తీసుకుని వెళ్లి తుపాకి గురిపెట్టి తనపై అత్యాచారం చేశాడని మహిళ తన ఫిర్యాదులో ఆరోపించింది.  

PREV
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్