హోటల్ కి తీసుకువెళ్లి..యువతిపై అత్యాచారం

Published : Oct 18, 2018, 11:31 AM IST
హోటల్ కి తీసుకువెళ్లి..యువతిపై అత్యాచారం

సారాంశం

కొన్నాళ్లు అంకిత్ బాలికతో ఫోన్ లో మాట్లాడుతుండేవాడు. ఓ రోజు బాలికను నిజాముద్దీన్ రైల్వేస్టేషనుకు పిలిపించి అక్కడి నుంచి క్యాబ్ లో గురుగ్రామ్ లో ఓ హోటల్ కు తీసుకువెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

హోటల్ కి తీసుకువెళ్లి.. యువతిపై యువకుడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంఘటన గురుగ్రామ్‌లో వెలుగుచూసింది. ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల అమ్మాయి తన తల్లి, సోదరులతో కలిసి ఉంటోంది. 

తండ్రి మరణించడంతో తల్లి ఇళ్లల్లో పనులు చేస్తుండేది. బాలికకు తన స్నేహితుల ద్వారా అంకిత్ భాటియా అనే యువకుడు పరిచయమయ్యాడు. కొన్నాళ్లు అంకిత్ బాలికతో ఫోన్ లో మాట్లాడుతుండేవాడు. ఓ రోజు బాలికను నిజాముద్దీన్ రైల్వేస్టేషనుకు పిలిపించి అక్కడి నుంచి క్యాబ్ లో గురుగ్రామ్ లో ఓ హోటల్ కు తీసుకువెళ్లి ఆమెపై పలుమార్లు అత్యాచారం చేశాడు.

 అనంతరం సంఘటన గురించి ఎవరికీ చెప్పవద్దని బెదిరిస్తుండేవాడు. బాలిక తన తల్లికి విషయం చెప్పి గురుగ్రామ్ పోలీసులకు ఫిర్యాదుచేసింది. పోలీసులు బాలికను వైద్యపరీక్ష చేయించగా ఆమెపై అత్యాచారం జరిగిందని తేలింది. దీంతో నిందితుడైన అంకిత్ ను పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IRCTC Char Dham Yatra: కేదార్‌నాథ్, బద్రీనాథ్ పుణ్యక్షేత్రాల దర్శనంతో ఐఆర్‌సీటీసీ చార్ ధామ్ యాత్ర క్రేజీ ప్యాకేజీ.. పూర్తి వివరాలు ఇవే !
జపాన్ ప్రధాని కి భారత్ స్టైల్ ల్లో అదిరిపోయే వెల్ కమ్ | PM Modi Welcomes Japanese PM Sanae Takaichi