ఒక్క ఓటుతో కుప్పకూలిన వాజ్‌పేయ్ సర్కార్

By narsimha lodeFirst Published Aug 16, 2018, 6:51 PM IST
Highlights

ఒక్క ఓటుతో వాజ్‌పేయ్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. 1999లో  రెండో దఫా ప్రధానమంత్రిగా ఎన్నికైన సమయంలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో  ఒక్క ఓటుతో వాజ్‌పేయ్ సర్కార్ కుప్పకూలిపోయింది. 

న్యూఢిల్లీ: ఒక్క ఓటుతో వాజ్‌పేయ్ ప్రధానమంత్రి పదవిని కోల్పోయారు. 1999లో  రెండో దఫా ప్రధానమంత్రిగా ఎన్నికైన సమయంలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో  ఒక్క ఓటుతో వాజ్‌పేయ్ సర్కార్ కుప్పకూలిపోయింది. 

1996లో వాజ్‌పేయ్  తొలిసారిగా ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.1996 మేలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో ఆయనకు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ వాజ్‌పేయ్‌ను ప్రధానమంత్రిగా ప్రమాణం చేయాలని ఆహ్వానించారు.ఈ ఆహ్వానం మేరకు వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు.  అయితే 13 రోజుల్లో వాజ్‌పేయ్  లోక్‌సభలో తన బలాన్ని నిరూపించుకోలేకపోయారు. దీంతో ఆయన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు.

1996, 1998లలో యునైటెడ్ ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో ఉన్నాయి. ఆ తర్వాత లోక్‌సభ రద్దైంది. 1998లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏగా ఏర్పాటైంది. వాజ్‌పేయ్ ప్రధానిగా ప్రమాణం చేశారు.

వాజ్‌పేయ్ 13 నెలల్లో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అయితే బీఎస్పీ, అన్నాడీఎంకెలు  వాజ్‌పేయ్ సర్కార్‌కు చివరి నిమిషంలో మద్దతును ఉపసంహరించుకోవడంతో  వాజ్‌పేయ్ ప్రభుత్వం కుప్పకూలింది.

1999 ఏప్రిల్ 17వ తేదీన ప్రభుత్వంపై అవిశ్వాస పరీక్ష సందర్భంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ఆనాడు బీఎస్పీ హమీ ఇచ్చింది. అయితే తీరా సభలో బీఎస్పీ అధినేత్రి మాయావతి  ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు చేస్తామని ప్రకటించింది. అన్నాడీఎంకె అధినేత్రి జయలలిత కూడ ఎన్డీఏ నుండి బయటకు వచ్చింది.  దీంతో ఆ సమయంలో ఒక్క ఓటుతో  వాజ్‌పేయ్ ప్రభుత్వం అవిశ్వాసంలో ఓటమి పాలైంది.

ఆ తర్వాత  1999లో జరిగిన ఎన్నికల్లో  బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏకు 504 సీట్లలో సంపూర్ణ మెజారిటీ సాధించారు.దీంతో  ఐదేళ్ల పాటు వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా కొనసాగారు.  కాంగ్రెస్ పార్టీయేతర ప్రధానిగా ఐదేళ్ల పాటు పదవిలో ఉన్న వ్యక్తిగా వాజ్‌పేయ్ రికార్డు సృష్టించాడు.

click me!