పాట్నాలో దారుణం: వివాహితపై సామూహిక అత్యాచారం

Siva Kodati |  
Published : Jun 19, 2019, 11:02 AM IST
పాట్నాలో దారుణం: వివాహితపై సామూహిక అత్యాచారం

సారాంశం

బీహార్‌లో దారుణం జరిగింది. వివాహితపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బీహార్‌లో దారుణం జరిగింది. వివాహితపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. 19 ఏళ్ల యువతికి వివాహమైంది.. అయితే భర్తతో మనస్పర్థల కారణంగా ఆదివారం రాత్రి తన పుట్టింటికి బయలు దేరింది.

ఇంటి నుంచి బయటకు వచ్చి అస్టా గ్రామంలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు రూ. 100కు ఆటో మాట్లాడుకుని బయలుదేరింది. అయితే ఆమెను తన వద్ద వుంచుకోవడానికి తల్లి అంగీకరించకపోవడంతో అదే ఆటోలో తిరిగి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్‌కు బయలుదేరింది.

ఈ క్రమంలో చోటు అనే ఆటోడ్రైవర్, రాజ్‌నీత్ అనే పెయింటర్ ఆమెపై కన్నేశారు. యువతిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడి అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

ఈ క్రమంలో బాధితురాలు దగ్గరలోని రైల్వే పోలీసులకు ఘోరాన్ని చెప్పింది. దీంతో ఆమెను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్‌నీత్, చోటు కుమార్‌లను లోహానీపూర్‌లో అదుపులోకి తీసుకున్నారు. 

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !