కాలువలోకి దూకి 19 ఏళ్ల యువతి మృతి... 13యేళ్ల వయసునుంచే డిప్రెషన్..16 ఏళ్లకే పెళ్లి..

By SumaBala BukkaFirst Published Apr 25, 2023, 12:00 PM IST
Highlights

బాధితురాలిని దేశ రాజధానిలోని న్యూ అశోక్ నగర్‌కు చెందిన స్వాతిగా గుర్తించామని, ఆమె మృతదేహాన్ని కాలువ నుండి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.

న్యూఢిల్లీ : న్యూ అశోక్ నగర్‌లోని ధర్మశిలా ఆసుపత్రి సమీపంలో 19 ఏళ్ల యువతి కాలువలోకి దూకి చనిపోయిందని పోలీసులు తెలిపారు.
బాధితురాలిని దేశ రాజధానిలోని న్యూ అశోక్ నగర్ నివాసి స్వాతిగా గుర్తించామని, ఆమె నిర్జీవమైన మృతదేహాన్ని 25 మీటర్ల లోతులో ఉన్న కాలువ నుండి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.

ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌కి పిసిఆర్ కాల్ వచ్చింది. అందులో తనను తాను పవన్ ఝా అని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి ఆదివారం సాయంత్రం నుండి తన కుమార్తె స్వాతి (19) తప్పిపోయిందని, ఆమె చెప్పు ఒకటి ధర్మశిల ఆసుపత్రి సమీపంలోని కాలువ వద్ద పడిపోయి దొరికిందని పేర్కొన్నాడు. 

Latest Videos

ఉత్తరప్రదేశ్ సీఎంకు మరో సారి హత్యా బెదిరింపు.. ‘యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తా’ అంటూ మెసేజ్..

ఈ సమాచారం మేరకు పోలీసు బృందం ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆమె తప్పిపోయిన బాధితురాలే అని ఆమె తండ్రి, భర్త గుర్తించారు. అయితే, ఆమె శరీరంపై ఎటువంటి గాయాల గుర్తులు కనిపించలేదని పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో 19 ఏళ్ల యువతి, మే 31, 2020న ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగి అయిన సుర్జీత్‌ను వివాహం చేసుకుంది.

ఆమె తండ్రి నోయిడాకు చెందిన ఓ కంపెనీలో డ్రైవర్‌. స్వాతికి 2017 నుండి కొన్ని మానసిక సమస్యలు ఉన్నాయని, ఐహెచ్‌బిఎఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ఆమె డిప్రెషన్‌కు చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా చూస్తే ఇది ఆత్మహత్య కేసుగా తెలుస్తోందని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా, మృత్యువు ఎప్పుడు, ఎక్కడ, ఎలా పలకరిస్తుందో తెలియదు. ప్రమాదం ఏ వైపునుంచి దాడి చేస్తుందో చెప్పలేం. ఏ ఘటన ఉన్నఫళాన మనిషిని విగతజీవిగా చేస్తుందో ఊహించలేం. ఇటీవలి కాలంలో ఇలాంటి మరణాలు.. ఘటనలు ఆశ్చర్యానికి, విషాదానికి లోను చేస్తున్నాయి. అలాంటి ఓ ఘటనే ఇది.

ముంబైలోని స్విమ్మింగ్ పూల్‌లో మరొక వ్యక్తి ఎత్తు నుండి దూకడంతో 72 ఏళ్ల వృద్ధుడు మరణించాడు. ఎత్తునుండి అతను దూకడంతో ఊపిరి ఆడలేదో.. ఆ నీటి ఒత్తిడికి తట్టుకోలేకపోయాడో వృద్ధుడు మరణించాడు. దీనిమీద ఓ పోలీసు అధికారి ధృవీకరించారు. 

ముంబై గోరేగావ్ ప్రాంతంలోని ఓజోన్ స్విమ్మింగ్ పూల్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుందని వారు తెలిపారు. మృతుడిని విష్ణు సామంత్‌గా గుర్తించామని, ఈత కొడుతుండగా 20 ఏళ్ల యువకుడు ఎత్తు నుంచి స్విమ్మింగ్ పూల్ లోకి దూకాడని అధికారి తెలిపారు.

"విష్ణు సామంత్‌ మెడ,  ఇతర శరీర భాగాలపై గాయాలు ఉన్నాయి. సమీపంలోని ఆసుపత్రికి తరలించేలోగా అతను మరణించాడని వారు ప్రకటించారు. అతని భార్య ఫిర్యాదు మేరకు, 20 ఏళ్ల వ్యక్తిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 304 A (నిర్లక్ష్యం వల్ల మరణానికి కారణం)- కింద కేసు నమోదు చేయబడింది" అని పోలీసులు తెలిపారు. 

click me!