మహారాష్ట్ర విలవిల: ఓవైపు ఒమిక్రాన్, మధ్యలో కోవిడ్.. ఒకే స్కూల్‌లో 19 మంది పిల్లలకు పాజిటివ్

By Siva KodatiFirst Published Dec 25, 2021, 4:02 PM IST
Highlights

అహ్మద్‌నగర్‌లో (ahmednagar) ఒక స్కూల్‌లో 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న 450 మంది విద్యార్థుల నమూనాలను కరోనా పరీక్ష కోసం పంపారు. అందులో 19 మందికి పాజిటివ్‌గా తేలింది.

దక్షిణాఫ్రికాలో (south africa) పుట్టిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (omicron) భారత్‌లోనూ వేగంగా విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కేసుల సంఖ్య 400 దాటడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు మరోసారి ఆంక్షలు విధించేందుకు యత్నాలు ప్రారంభించాయి. ఇదే సమయంలో కరోనా వైరస్ సైతం విజృంభించడంతో ప్రభుత్వాలు తల పట్టుకుంటున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో (maharashtra) పరిస్ధితి తీవ్రంగా వుంది. 

తాజాగా రాష్ట్రంలోని అహ్మద్‌నగర్‌లో (ahmednagar) ఒక స్కూల్‌లో 19 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. జిల్లాలోని టాక్లీ ధోకేశ్వర్ (takli dhokeshwar) గ్రామంలో రెసిడెన్షియల్ సీబీఎస్‌ఐ అనుబంధ పాఠశాల అయిన జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుతున్న 450 మంది విద్యార్థుల నమూనాలను కరోనా పరీక్ష కోసం పంపారు. అందులో 19 మందికి పాజిటివ్‌గా తేలింది. కరోనా సోకిన విద్యార్థులను పార్నర్స్ రూరల్ హాస్పిటల్‌లోని ఐసొలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ విద్యార్థులతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను ట్రేస్‌ చేసి వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

Also Read:ముంబైలో న్యూయ‌ర్ వేడుక‌లు ర‌ద్దు- ప్ర‌క‌టించిన బీఎంసీ

మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ విస్త‌రిస్తున్న నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. ఒమిక్రాన్ ను నియంత్రించ‌డానికి చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. క‌ఠిన నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. అందులో భాగంగా ఇప్ప‌టికే ప‌లు ఢిల్లీ, క‌ర్నాట‌క రాష్ట్రాలు క్రిస్మ‌స్‌, న్యూయ‌ర్ వేడుక‌లు ర‌ద్దు చేశాయి. ఆ దారిలోనే ఇప్పుడు మ‌హారాష్ట్రలోని  బొంబాయ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఓ నిర్ణ‌యం తీసుకుంది. ముంబై పట్ట‌ణంలో న్యూయ‌ర్ వేడుకుల‌ను ర‌ద్దు చేస్తున్నామ‌ని బీఎంసీ (బొంబాయ్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌) (brihan mumbai corporation) శుక్ర‌వారం సాయంత్రం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.  

ముంబై న‌గ‌రంలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయ‌ని దీంతో ఆంక్ష‌లు విధిస్తున్నామ‌ని బీఎంసీ ప్ర‌క‌టించింది. ప‌ట్ట‌ణంలోని ఏ ప్రాంతంలో అయినా బ‌హిరంగ ప్ర‌దేశాల్లో న్యూయ‌ర్ వేడుకలు, ఏ ఇతర పార్టీల‌కు అనుమ‌తి లేద‌ని మున్సిపల్ క‌మిష‌న‌ర్ ఐఎస్ చాహ‌ల్ తెలిపారు. నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల సంద‌ర్భంగా కోవిడ్ - 19 కేసులు పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. దీనిని నివారించ‌డానికి కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింద‌ని తెలిపారు

click me!