170 జిల్లాల్లో కరోనా హాట్ స్పాట్స్: కేంద్ర ఆరోగ్య శాఖ

By narsimha lode  |  First Published Apr 15, 2020, 5:04 PM IST
దేశంలో 170 జిల్లాలను హాట్ స్పాట్స్ లుగా గుర్తించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ  లవ్ అగర్వాల్ చెప్పారు. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామన్నారు.


న్యూఢిల్లీ:దేశంలో 170 జిల్లాలను హాట్ స్పాట్స్ లుగా గుర్తించినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ  లవ్ అగర్వాల్ చెప్పారు. ఈ జిల్లాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించామన్నారు.

బుధవారంనాడు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్ పై కొత్త గైడ్ లైన్స్ ను విడుదల చేసినట్టుగా ఆయన తెలిపారు.హాట్ స్పాట్స్, నాన్ హాట్ స్పాట్స్, గ్రీన్ జోన్లుగా కరోనా కేసులు నమోదయ్యే సంఖ్యను బట్టి ప్రాంతాలపై నిర్ణయం తీసుకొంటామని ఆయన ప్రకటించారు.

హాట్ స్పాట్స్, కంటైన్మెంట్ జోన్లలో మార్గదర్శకాలను రూపొందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఎంట్రీ పాయింట్స్, ఎగ్జిట్ పాయింట్ వద్ద ఎలా ఉండాలనే దానిపై కూడ స్పష్టత ఇచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారరు. 

హాట్‌స్పాట్స్‌లో ఇంటింటి సర్వే నిర్వహిస్తామన్నారు. హాట్ స్పాట్స్ కాని ప్రాంతాలు, గ్రీన్ జోన్లలో ఈ నెల 20 నుండి కొన్ని నిబంధనలను సడలించనున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ తెలిపారు.దేశంలో కరోనా సామూహిక వ్యాప్తి చెందలేదని ఆయన స్పష్టం చేశారు.
also read:దారుణం:క్వారంటైన్‌కు తీసుకెళ్తుండగా అంబులెన్స్‌పై రాళ్ల దాడి, గాయాలు

కరోనాతో ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థపై ఫోకస్ పెట్టామన్నారు.ఉపాధి హామీ కూలీలు కూడ సోషల్ డిస్టెన్స్ పాటించాలని లవ్ అగర్వాల్ సూచించారు.

దేశంలో కరోనా సోకి చికిత్స పొందిన తర్వాత 1306 మంది కోలుకొన్నారని ఆయన చెప్పారు.దేశంలో ఇవాళ్టికి 11,439 కేసులు నమోదైనట్టుగా తెలిపారు. గడిచిన 24 గంటల్లో 1076 కేసులు నమోదైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికి ఈ వైరస్ సోకి 377 మంది మరణించారని  లవ్ అగర్వాల్ చెప్పారు.
 
click me!