17th Century Tamil Bible: 17వ శ‌తాబ్దం నాటి బైబిల్ దొంగ‌త‌నం.. 17 ఏండ్ల త‌రువాత లండ‌న్ మ్యూజియంలో ప్ర‌త్యేక్షం

By Rajesh KFirst Published Jul 1, 2022, 11:21 PM IST
Highlights

17th Century Tamil Bible:17 ఏండ్ల క్రితం తంజావూరులోని సరస్వతి మహల్ లైబ్రరీలో దొంగతనానికి గురైన‌ 17 వ శ‌తాబ్దం నాటి అరుదైన‌ బైబిల్ ను త‌మిళ‌నాడు ఐడల్ వింగ్ క‌నిపెట్టింది. ఆ ప‌విత్ర గ్రంథాన్ని విదేశీ దొంగ‌లు దొంగిలించార‌నీ, ప్ర‌స్తుతం ఆ గ్రంథం లండన్‌లోని మ్యూజియంలో ఉన్న‌ట్టు  తెలిపింది. బైబిల్‌ను తిరిగి భార‌త్ కు తీసుకుని రావ‌డానికి చర్యలు చేపట్టారు.  

17th Century Tamil Bible: పాతికేళ్ల క్రితం త‌మిళ‌నాడులో దొంగిలించిన 17 వ శ‌తాబ్దం నాటి అరుదైన‌ బైబిల్ ను ఆ రాష్ట్ర ఐడల్ వింగ్ క‌నిపెట్టింది. ఆ ప‌విత్ర గ్రంథాన్ని జాడ‌ను తెలుసుకుంది. ఆ పుస్త‌కాన్నివిదేశీ దొంగ‌లు దొంగిలించార‌నీ, ప్ర‌స్తుతం ఆ గ్రంథం లండన్‌లోని మ్యూజియంలో ఉన్న‌ట్టు  తెలిపింది.  ఈ గంథ్రం తంజావూరులోని సరస్వతి మహల్ లైబ్రరీ నుంచి 2005లో దొంగిలించబడింది.  బైబిల్‌ను తిరిగి భార‌త్ కు తీసుకుని రావ‌డానికి చర్యలు చేపట్టారు అధికారు.. 

ఈ బైబిల్ ప్రత్యేకత ఏమిటంటే.. 17వ శతాబ్దంలో త‌మిళంలో వ్రాయబడిన ప్రపంచంలోని మొట్టమొదటి బైబిల్ ఇది.  దీనిని తరంగంబాడి సంస్థానంలో ముద్రించబడింది. దీనిని తంజావూరుకు చెందిన రాజా సర్ఫోజీ రాశారు. ఈ పవిత్ర గ్రంథాన్నివిదేశీయుల బృందం దొంగిలించిందని తమిళనాడు ఐడల్ వింగ్ శుక్రవారం నివేదించింది. ఈ పుస్తకం లండన్‌లోని మ్యూజియంలో ఉందని వింగ్ తెలిపింది. ద‌ర్యాప్తులో రాజా సెర్ఫోజీ సంతకంతో ఈ బైబిల్‌ను లండన్‌లోని మ్యూజియంలో ఉన్నట్టు గుర్తించారు. 

అక్టోబర్ 10, 2005న పురాత‌న‌ బైబిల్ దొంగిలించబడిందని సెర్ఫోజీ ప్యాలెస్ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ తంజావూరు వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొన్ని రోజులు ద‌ర్యాప్తు చేసి.. పురోగ‌తి క‌నిపించ‌క‌పోవ‌డంతో కేసును క్లోజ్ చేశారు. 

కానీ, అక్టోబరు 17, 2017న, సరస్వతీ మహల్‌లో బైబిల్ అదృశ్యంపై ఇ. రాజేంద్రన్ అనే వ్యక్తి  వింగ్-సిఐడికి ఫిర్యాదు చేశారు.ఆ ఫిర్యాదును స్వీక‌రించి.. కేసు నమోదు చేసుకుని వింగ్ అధికారులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో తమిళనాడు ఐడల్ వింగ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె జయంత్ మురళి, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆర్ దినకరన్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి రవి దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఈ క్ర‌మంలో పవిత్ర గ్రంథాన్ని గుర్తించేందుకు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇందిర ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం.. ప్ర‌ధానంగా ఆ లైబ్ర‌రీ సందర్శకులపై ఫోక‌స్ చేసింది. విజిట‌ర్స్ రిజిస్టర్‌ను పరిశీలించగా.. బైబిల్ తప్పిపోయిన రోజున‌(అక్టోబర్ 7, 2005న) సరస్వతీ మహల్ లైబ్రరీకి కొంతమంది విదేశీ సందర్శకులు వచ్చినట్లు గుర్తించారు. 

వారు డానిష్ మిషనరీ అయిన బార్తోలోమియస్ జీగెన్‌బాల్గ్ స్మారకార్థం జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు సందర్శకులు భారతదేశానికి వచ్చినట్లు తదుపరి విచారణలో వెల్లడైంది. వారిని అనుమానిస్తూ.. వింగ్ ప్రపంచంలోని వివిధ మ్యూజియంలు, బార్తోలోమియస్ జిగెన్‌బాల్గ్‌తో అనుసంధానించబడిన  వెబ్‌సైట్‌లు, సంస్థల వెబ్ సైట్ల‌పై క‌న్నేసింది.

ఈ క్ర‌మంలో లండ‌న్ లోని జార్జ్ III మ్యూజియం సంబంధించిన వెబ్ సైట్లో.. అరుదుగా ల‌భించే వేలాది ముద్రిత పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్‌లు, కరపత్రాలు ఉన్న‌ట్టు గుర్తించింది. ఆ వేల పుస్తకాల మధ్య దొంగిలించబడిన బైబిల్ దాగి ఉంది. సరస్వతి మహల్ లైబ్రరీకి మిస్సాయిన‌.. బైబిల్ ఆన‌వాళ్ల‌ను.. ఆ సైట్ల‌లో ఉన్న గంథ్రంతో స‌రిపోల‌డంతో ..దొంగిలించ‌బ‌డిన పుస్త‌కమిదేన‌ని ధృవీక‌రించారు.యునెస్కో ఒప్పందం ప్రకారం.. త్వరలో బైబిల్‌ను సరస్వతి మహల్ లైబ్రరీకి తిరిగి తీసుక‌రావ‌డానికి చ‌ర్య‌లు ప్రారంభించామ‌ని  ఐడల్ వింగ్ తెలిపింది.

అప్పటి తంజోర్ రాజు సెర్ఫోజీకి డానిష్ మిషనరీ ఇచ్చిన పవిత్ర గ్రంథం కాపీ, మహారాజు యొక్క అరుదైన మాన్యుస్క్రిప్ట్. పుస్తకం యొక్క ముఖచిత్రంపై అప్పటి తంజోర్ రాజు సెర్ఫోజీ సంతకం ఉండటంతో దీని విలువ మరింత పెరిగింది. ఈ అరుదైన బైబిల్‌ను సరస్వతి మహల్ లైబ్రరీకి పునరుద్ధరించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు.

click me!