17యేళ్ల బాలికపై తండ్రి, సోదరుడి లైంగిక వేధింపులు.. స్కూల్లో టీచర్లకు చెప్పడంతో వెలుగులోకి...

Published : Feb 21, 2023, 12:05 PM IST
17యేళ్ల బాలికపై తండ్రి, సోదరుడి లైంగిక వేధింపులు.. స్కూల్లో టీచర్లకు చెప్పడంతో వెలుగులోకి...

సారాంశం

తన తండ్రి, సోదరుడు తనను లైంగికంగా వేధించారని ఓ 17 యేళ్ల విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులకు చెప్పి బోరుమంది. దీంతో ఈ దారుణమైన ఘటన వెలుగు చూసింది. 

గురుగ్రామ్ : గురుగ్రామ్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. ఓ  17 ఏళ్ల బాలికపై ఆమె తండ్రి, సోదరుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు సోమవారం పోలీసులు వివరాలు తెలిపారు.

11వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థిని తన స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్‌లకు వేధింపులకు సంబంధించి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె చెప్పింది విన్న వారు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

తన తండ్రి, సోదరుడు తనను లైంగికంగా వేధించారని విద్యార్థిని పాఠశాల ప్రిన్సిపాల్‌, ఉపాధ్యాయులకు తెలిపింది. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని కూడా బెదిరించినట్లుగా తెలిపిందని పోలీసులు సోమవారం తెలిపారు. 

పదకొండేళ్ల చిన్నారి సాహసం... నీటిలో మునిగిపోతున్న అత్తను కాపాడింది.. కానీ తల్లీ, తమ్ముడు జలసమాధి..

దాదాపు నాలుగు గంటల పాటు బాలికకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రకరకాలుగా ఆమెను ప్రశ్నించారు. ఆ తరువాత స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోక్సో చట్టంలోని సెక్షన్ల కింద పోలీసు ఫిర్యాదు లేదా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వారు తెలిపారు. "మేము వాస్తవాలను ధృవీకరిస్తున్నాం. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం" అని ఒక సీనియర్ అధికారి తెలిపారు.

ఇదిలా ఉండగా, సొంత అక్కే చెల్లిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన మహారాష్ట్రలో వెలుగు చూసింది. ఓ యువతి సొంత అక్క తనమీద లైంగిక వేధింపులకు పాల్పడుతుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణే జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఓ అక్క చెల్లెలు ఒకే ఇంట్లో ఉంటున్నారు. అక్కకు 24 సంవత్సరాలు,  చెల్లెలికి 18యేళ్లు.

అక్క ఉన్నత విద్యావంతురాలు. పెళ్లి కూడా అయింది. ఇటీవల కొంతకాలంగా చెల్లెలు అక్క దగ్గరికి వచ్చి ఉంటుంది. పూణె జిల్లాలోని విమానగర్ ప్రాంతంలో వీరు ఉంటారు. ఈనెల 23న అక్క ఇంట్లోనే హాలులో చెల్లి నిద్రపోతోంది. ఆ సమయంలో చెల్లి దగ్గరికి వచ్చిన అక్క లైంగికంగా వేధించడం మొదలుపెట్టింది.  అది తప్పు అని చెల్లి ఎంత వారిస్తున్నా అక్క వినలేదు. అక్కని ఎలా వారించాలో తెలియని చెల్లి..  పోలీస్ స్టేషన్కు వెళ్లింది.  ఈ మేరకు అక్కపై ఫిర్యాదు చేసింది.

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?