స్నేహితుడిని చంపి అడవిలో పడేసిన మైనర్.. పీక్కుతున్న జంతువులు..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 03, 2020, 02:04 PM IST
స్నేహితుడిని చంపి అడవిలో పడేసిన మైనర్.. పీక్కుతున్న జంతువులు..

సారాంశం

ఓ బాలుడిని హత్యచేసి అడవిలో పడేస్తే.. శవాన్ని అడవి జంతువులు పీక్కుతున్న దారుణ సంఘటన ఢిల్లీలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనలో ఓ మైనర్ బాలుడు రూ. 2500 కోసం తన స్నేహితుడ్ని చంపి, అడవిలో పడేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణ ఢిల్లీలోని ప్రజాపతి మోహల్లా గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్‌ అతడి మిత్రుడికి రూ. 2500 అప్పుగా ఇచ్చాడు. అయితే స్నేహితుడు ఎంతకీ అప్పు తీర్చకపోవటంతో మైనర్‌కు విపరీతమైన కోపం వచ్చింది. గత నెలలో అప్పు విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. 

గొడవ పెరిగి మైనర్‌ అతడి మిత్రుడ్ని బండరాయితో కొట్టి చంపాడు. ఆ తర్వాత శవాన్ని దగ్గర్లోని మైదాన్‌గర్హి అడవిలో పడేశాడు. ఆ తర్వాత నిందితుడు హత్య విషయాన్ని తండ్రికి చెప్పాడు. దీంతో ఆయన వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 

పోలీసులు అడవిలోకి గాలించగా మృతుడి శవం కనిపించింది. అయితే అప్పటికే శవం అరచేతులు, తల భాగాల్ని కొద్దిగా అడవి జంతువులు పీక్కుతిన్నాయి. మృతుడి తల్లిదండ్రులు బట్టలు, శరీరంపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా కుమారుడ్ని గుర్తించారు. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు.
 
PREV
click me!

Recommended Stories

Government Jobs : రూ.78,800 శాలరీతో 173 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ
EPFO : ఈపీఎఫ్‌వో కొత్త రూల్.. ఇకపై గూగుల్ పే, ఫోన్ పే ద్వారా పీఎఫ్ డబ్బులు