ఢిల్లీలో అగ్నిప్రమాదం.. మృతుల్లో విశాఖ వాసి

Published : Feb 12, 2019, 03:14 PM IST
ఢిల్లీలో అగ్నిప్రమాదం.. మృతుల్లో విశాఖ వాసి

సారాంశం

దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో విశాఖ వాసి ఒకరు కన్నుమూశారు.

దేశరాజధాని ఢిల్లీలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో విశాఖ వాసి ఒకరు కన్నుమూశారు. కరోల్‌బాగ్‌ ప్రాంతంలోని అర్పిత్ ప్యాలెస్ హోటల్‌లో మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ ప్రమాదంలో 17మంది సజీవదహనమవ్వగా.. మృతుల్లో ఒకరు విశాఖ జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. 

విశాఖ నగరం ఏండాడ ప్రాంతానికి చెందిన మల్కాపురం హెచ్పీసీఎల్ డిప్యూటీ మేనేజర్ చలపతిరావు ఆ అగ్నిప్రమాదంలో చిక్కుకొని దుర్మరణం పాలయ్యారు. ఢిల్లీలో జరిగే పెట్రోటెక్ సదస్సుకు హాజరయ్యేందుకు విశాఖ నుంచి వెళ్లిన ఆయన ఆ హోటల్ లో బస చేశారు. కాగా.. మంగళవవారం ఉదయం ప్రమాదవశాత్తు ఆ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

మొత్తం మృతులు 17మంది కాగా.. వారిలో ఒక స్త్రీ, మరో చిన్నారి కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన కొందరు భవనంపై నుంచి కిందకు దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. కాగా.. మృతుల కుంబీకులకు ఢిల్లీ ప్రమాదం రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడం విశేషం. 
 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?