పశ్చిమబెంగాల్ లో దారుణం.. చెత్తకుండీలో పదిహేడు పిండాలు..!

By Bukka SumabalaFirst Published Aug 17, 2022, 8:34 AM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో మంగళవారం ఓ చెత్తకుండీలో 17 పిండాలను మున్సిపాలిటీ సిబ్బంది కనుగొన్నారు. దీని మీద విచారణ చేపట్టారు.

పశ్చిమ బెంగాల్‌ : west bengalలోని హౌరాలో హృదయవిదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మంగళవారంనాడు ఉలుబెరియా నగరం మున్సిపాలిటీ చెత్త కుండీలో 17 Aborted Fetuses బయటపడ్డాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. భయాందోళనలకు గురిచేసింది.  
ఉబేరియా మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 31లోని ఉలుబెరియాలోని బనిబాలా ఖారాలో ఈ పిండాలు కనిపించాయి. ఈ 17 పిండాలలో పది ఆడపిల్లలవి, ఆరు మగ పిల్లలవిగా గుర్తించారు.

ఉలుబెరియా మునిసిపాలిటీ ప్రకారం, ఉలుబెరియా పట్టణ ప్రాంతానికి ఒకటిన్నర కిలోమీటర్ల పరిధిలో 30 ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌లు ఉన్నాయి. ఈ పిండాలను నర్సింగ్‌హోమ్‌ల వైద్య వ్యర్థాలుగా ఇక్కడ పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పిండాలను పోస్ట్‌మార్టం కోసం ఉల్బారియా ఆసుపత్రికి తరలించారు. ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి.. అనే విషయాన్ని ఆరా తీయడానికి పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

అక్రమంగా అబార్షన్లు చేసి.. పిండాలను బాక్సులో పెట్టి పడేశారు.. విచారణకు ఆదేశాలు...

ఇలాంటి ఘటనే ఈ జూన్ 25న కర్ణాటకలో వెలుగుచూసింది. కర్ణాటకలోని బెలగావి జిల్లా మూడలగి గ్రామ శివార్లలో శుక్రవారం ఒక డబ్బాలో ఏడు అబార్షన్ చేసిన పిండాల అవశేషాలు బయటపడ్డాయి. దీన్ని గమనించిన స్థానికులు మొదట షాక్ తో భయాందోళనలకు గురయ్యారు. ఆ తరువాత తేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ షాకింగ్ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది.

బెళగావి జిల్లా ముదలగి పట్టణంలోని బస్టాప్ సమీపంలో స్థానికులకు ఓ బాక్స్ కనిపించింది. అయితే, అది అనుమానాస్పదంగా కనిపించడంతో.. వారు ధైర్యం చేసి అదేంటో చూడడానికి.. దాన్ని తెరిచారు. అందులో గర్భస్రావం చేసిన ఏడు పిండాలు కనిపించాయి. వెంటనే వారు ఈ ఘటన మీద పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.

"అనుమానాస్పదంగా ఉన్న ఓ డబ్బాలో ఏడు పిండాలు దొరికాయి. అవి అన్నీ ఐదు నెలల గర్భస్థ పిండాలుగా తెలుస్తున్నాయి. గర్భస్థశిశువు  లింగనిర్ధారణ చేయడం.. ఆ తరువాత వద్దనుకుని హత్య చేసినట్లు గుర్తించబడ్డాయి. జిల్లా అధికారులకు సమాచారం అందించిన వెంటనే అధికారుల బృందంగా ఏర్పడి విచారణ జరుపుతుంది" అని జిల్లా ఆరోగ్య, కుటుంబ సంక్షేమాధికారి డాక్టర్ మహేష్ కోని మీడియా ప్రతినిధులకు తెలిపారు.

అతను ఇంకా మాట్లాడుతూ, "ఈ దొరికిన పిండాలను.. వెంటనే అక్కడినుంచి తరలించిదగ్గర్లోని ఆసుపత్రిలో బధ్రపరిచారని, ఆ తరువాత పరీక్ష కోసం జిల్లా ఫంక్షనల్ సైన్స్ సెంటర్‌కు తీసుకువచ్చారని" తెలిపారు. ఈ విషయమై పోలీసు కేసు నమోదైంది. తదుపరి విచారణ జరుగుతోందని కూడా చెప్పుకొచ్చారు. 
 

click me!