
బెంగళూరు : బెంగళూరులో దారుణం జరిగింది. ఓ పదహారేళ్ల బాలిక మీద ఆరు రోజులుగా rape జరిగిన అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆగ్నేయ బెంగళూరులోని బండేపాల్యలో ఇద్దరు women tailors ఇళ్లలో 16 ఏళ్ల బాలికను బంధించి ఆరు రోజులుగా rape చేశారు. బాలిక ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడాన్ని గమనించిన బాలిక తల్లి ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిని అరెస్టు చేశారు. బాలికపై పలుమార్లు అత్యాచారం జరిగినట్లు వైద్య నివేదికలు నిర్ధారించాయి.
తల్లి ఫిర్యాదు మేరకు హెచ్‌ఎస్‌ఆర్ లేఅవుట్ పోలీసులు ఇద్దరు మహిళలతో సహా నిందితులపై బాలల లైంగిక నేరాల నుంచి రక్షణ(పోక్సో) చట్టం, ఐపీసీ 376 (రేప్) కింద కేసు నమోదు చేశారు. నిందితులు రాజేశ్వరి, కేశవ మూర్తి, కళావతి, రఫీక్, శరత్, సత్య రాజు.. వీరంతా 30 యేళ్ల మధ్య వయసు వారే. బందెపాళ్యం, పరిసర ప్రాంతాల్లో నివాసించేవారే.
రాజేశ్వరి, కళావతిలు ఆ బాలిక ఇంటి సమీపంలోనే ఉండేవారు. బాలిక స్కూల్ అయిపోయిన తరువాత టైలరింగ్ నేర్చుకునేందుకు తరచుగా వారి ఇంటికి వెడుతుండేది. బాలిక తెలిపిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి 28 మధ్యాహ్నం రాజేశ్వరి ఆమెను బయటకు తీసుకెళ్లింది. “నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు.. రాజేశ్వరి వచ్చింది. ఆ సమయంలో మా అమ్మానాన్న పనికోసం బైటికి వెళ్లారు. అప్పుడు రాజేశ్వరి వచ్చి.. వాళ్లింట్లో మా అమ్మ నా కోసం ఎదురుచూస్తుందని చెప్పి.. నన్ను తన ఇంటికి తీసుకెళ్లింది. వెళ్లిన తరువాత నాకు పండ్లరసం ఇచ్చింది. అది తాగగానే స్పృహతప్పి పడిపోయాను. నేను స్పృహలోకి వచ్చాక చూస్తే.. నేను మంచం మీద పడుకుని ఉన్నాను. నా కాళ్ళు, శరీరంలోని ఇతర భాగాల్లో రక్తపు మరకలు ఉన్నాయి”అని అమ్మాయి పేర్కొంది.
ఏం జరిగిందో బయటపెడితే తీవ్ర పరిణామాలుంటాయని రాజేశ్వరి నన్ను హెచ్చరించింది. “ఆ తరువాత రాజేశ్వరి నన్ను కళావతి ఇంటికి తీసుకువెళ్లింది. అక్కడ వేర్వేరు రోజుల్లో ఇతరు వ్యక్తులు కూడా నాపై అత్యాచారం చేశారు. దీంతో నాకు భయం వేసింది. శారీరకంగా, మానసికంగా హింసించారు. నా ఆరోగ్యం దెబ్బతిన్నంది. అయినా రాజేశ్వరి, కళావతి తమ ఇళ్లకు క్రమం తప్పకుండా రావాలని బెదిరించారు. నన్ను బలవంతం చేస్తున్నారు' అని బాలిక ఆరోపించింది.
మార్చి 6న రాజేశ్వరి తన ఇంటికి రావాలని బాలికను కోరినట్లు సమాచారం... ఆ రోజు, అమ్మాయి తల్లి ఇంట్లో ఉంది. కుమార్తె కంగారు పడడం గమనించింది. ఏం జరిగిందని అడిగితే భయపడింది. ఆ తర్వాత గమనిస్తే ఆమె బట్టలపై రక్తపు మరకలు కనిపించాయని.. దీంతో గట్టిగా నిలదీస్తే అన్ని విషయాలు బయటపెట్టిందని పోలీసులు తెలిపారు. అదే రోజు రాత్రి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు దుండగులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
“రాజేశ్వరి, కళావతి ఫిర్యాదు అందడంతో నగరం విడిచి పారిపోయారు. మేము మార్చి 7 సాయంత్రం నగర శివార్లలో వారిని పట్టుకుని, విచారించిన తరువాత, నలుగురు వ్యక్తుల వివరాలను సేకరించాం. ఒకరి తర్వాత ఒకరిగా.. మేము వారిని అరెస్టు చేశాం. వారందరినీ మార్చి 8 న కోర్టు ముందు హాజరుపరిచాము. వారు ఇప్పుడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు”అని ఒక దర్యాప్తు అధికారి తెలిపారు.
హోసూరుకు చెందిన కేశవమూర్తి ఓ ఆటోమొబైల్ కంపెనీలో జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కోరమంగళకు చెందిన సత్యరాజు కాంట్రాక్టర్. యలహంకకు చెందిన శరత్, బేగూర్‌కు చెందిన రఫీక్ వ్యాపారులు. రాజేశ్వరి, కళావతి సెక్స్ వర్కర్లని, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన తర్వాత వారి నుంచి డబ్బులు తీసుకున్నారని పోలీసులు తెలిపారు.