
Gujarat: ఫోన్ కోసం అన్నతమ్ముళ్ల మధ్య గొడవ జరిగింది. క్షణికావేశంలో అన్న తమ్ముడిని రాయితో కొట్టి చంపాడు. మొబైల్ ఫోన్ లో ఆన్‌లైన్ గేమ్ ఆడేందుకు జరిగిన ఈ ఘటన గురించి తెలుసుకుని పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుందని ఎన్‌డీ టీవీ నివేదించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో ఆన్‌లైన్ గేమ్ ఆడేందుకు మొబైల్ ఫోన్‌ను పంచుకోవడంపై వారి మధ్య జరిగిన గొడవ జరగింది. ఈ క్రమంలోనే 16 ఏళ్ల బాలుడు తన తమ్ముడిని రాయితో కొట్టి చంపాడు. అంతటితో ఆగకుండా మృత దేహాన్ని బావిలో పడేసినట్లు పోలీసులు గురువారం తెలిపారు. ఈ సంఘటన సోమవారం గోబ్లెజ్ గ్రామంలో జరగగా, మైనర్ నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు ఖేడా టౌన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్పీ ప్రజాపతి తెలిపారు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. కుటుంబం పొరుగున ఉన్న రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లాకు చెందినదని మరియు గ్రామ శివార్లలోని వ్యవసాయ పొలంలో వ్యవసాయ కూలీలుగా పని చేయడానికి గోబ్లెజ్‌కు వచ్చినట్టు చేప్పారు. అయితే, “మే 23న, అబ్బాయిలు వంతులవారీగా మొబైల్ ఫోన్‌లో గేమ్ ఆడుతున్నప్పుడు, నిందితుడు తన వంతు వచ్చినప్పుడు పరికరాన్ని ఇవ్వడానికి నిరాకరించిన అతని 11 ఏళ్ల సోదరుడితో గొడవపడ్డాడు. ఆవేశంతో యువకుడు తన తమ్ముడి తలపై పెద్ద రాయితో కొట్టాడు" అని ప్రజాపతి తెలిపారు. అతను స్పృహ తప్పి పడిపోయిన తర్వాత, యువకుడు తీగతో బాధితుడికి రాయిని కట్టి, ఎవరూ లేని సమయంలో సమీపంలోని బావిలో పడేశాడని పోలీసులు తెలిపారు.
ఇది జరగిన తర్వాత తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా నిందితుడైన మైనర్ బస్సు ఎక్కి రాజస్థాన్‌లోని తన స్వగ్రామానికి వెళ్లాడని అతను చెప్పాడు. ‘‘సాయంత్రం వరకు తమ కుమారులిద్దరూ ఇంట్లో కనిపించకపోవడంతో తల్లిదండ్రులు వారి ఊరికి వెళ్లి పెద్ద కొడుకు ఆచూకీ తెలుసుకున్నారు. తిరిగి తీసుకొచ్చి తమ్ముడి గురించి ఆరా తీస్తే నిందితుడు జరిగిన ఘటన గురించి చెప్పాడు. మొబైల్ ఆన్‌లైన్ గేమ్ ఆడటం కోసం ఇద్దరి మద్య జరిగిన గొడవ తర్వాత అతన్ని చంపేశానని నిందితుడు చెప్పాడని పోలీసు అధికారి తెలిపారు. బుధవారం కుటుంబీకుల నుండి ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బావిలో నుండి బాధితుడి మృతదేహాన్ని వెలికితీసి మైనర్‌పై హత్య కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
ఇదిలావుండగా, అప్పు ఇచ్చిన మహిళను murder చేసి.. Corpseని పట్టాలపై పారేసిన యువకుడిని ముంబై రైల్వే పోలీసులు 14 గంటల్లోనే అరెస్టు చేశారు. CCTV cameraల ఆధారంగా ఈ అరెస్టు చేసినట్లు వారు వివరించారు. డబ్బు వివాదం కారణంగానే ఆ మహిళను చంపినట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడు. పోలీసుల కథనం ప్రకారం.. గోరేగావ్ లో నివసిస్తున్న సారిక దామోదర్ చల్కే (30) ఒక ప్రైవేటు సంస్థలో పని చేసేది. అక్కడే హౌస్కీపింగ్ ఈ విభాగంలో పనిచేస్తున్న ఖైర్నార్ పలు విడతలుగా ఆమె వద్ద భారీ మొత్తాన్ని అప్పుగా తీసుకున్నాడు. రోజులు గడుస్తున్నా డబ్బు తిరిగి చెల్లించకపోవడంతో.. రుణం తిరిగి చెల్లించాల్సిందిగా ఆ మహిళ కోరింది. దీంతో ఖైర్నార్ ఆమెతో గొడవ పడ్డాడు. ఈ క్రమంలోనే ఆమె ప్రాణాలు తీశాడు.