Lizard In Buttermilk: పెళ్లిలో అప‌సృతి.. మజ్జిగలో బల్లి.. వధూవరులతో సహా 16 మందికి అస్వస్థత..

By Rajesh KFirst Published May 24, 2022, 2:17 AM IST
Highlights

Lizard In Buttermilk: ఓ వివాహ వేడుకలో అప‌సృతి చేసుకుంది. బల్లి పడిన మజ్జిగ తాగిన వధూవరులతో సహా 16 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల‌ను వెంటనే  ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటన రాజస్థాన్​లోని భరత్​పుర్​ జిల్లాలో జరిగింది.
 

Lizard In Buttermilk: పెళ్లి ఇంట్లో అప‌సృతి చోటు చేసుకుంది. బ‌ల్లి ప‌డిన మ‌జ్జిగ తాగి.. నూత‌న వధువుతో సహా 16 అతిథులు  ఆస్ప‌తి పాలైంది.  మజ్జిగ తయారు చేసే పాత్రలో బల్లి పడింది.  ఆ విష‌యాన్ని గ‌మ‌నించ‌గా  నూత‌న వధూవరులతో సహా పిల్లలు, కుటుంబ సభ్యులు మజ్జిగ తాగగా. దీంతో   అందరి ఆరోగ్యం క్షీణించింది. ఈ వెంట‌నే బాధితుల‌ను భరత్‌పూర్‌లోని సిక్రి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 

వివ‌రాల్లోకెళ్తే. రాజస్థాన్​ భరత్​పుర్​ జిల్లాలోని సిక్రీలోని ఓ గ్రామానికి చెందిన దిన్ మహ్మద్ కుమారుడు నిజాముద్దీన్‌కు మే 19న వివాహం జరిగింది. వివాహ అనంతరం జరిగిన ఓ కార్యక్రమానికి అతిథులు హజరయ్యారు. వారందరికీ మజ్జిగ అందించారు. ఈ క్ర‌మంలో బల్లి పడిన మజ్జిగ తాగి 16 మంది అనారోగ్యం బారినపడ్డారు. అందులో వధూవరులు కూడా ఉన్నారు. వీరందరినీ హుటాహుటిన సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించారు. ముగ్గురి ఆరోగ్యం క్షీణించడం వల్ల వారిని ఆళ్వార్‌ ఆసుపత్రిలో చేర్చారు. చివరగా, కుటుంబ సభ్యులు మజ్జిగ కుండను ఖాళీ చేయగా, అందులో బల్లి ముక్కలై కనిపించింది.

 

Food Poisoning: మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా నిలంగా తహసీల్‌లోని ఓ వివాహ వేడుకలో ఆహారం తిన్న సుమారు 330 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ అధికారి సోమవారం వెల్లడించారు. కేదార్‌పూర్ గ్రామంలో వివాహా భోజనం చేసిన త‌రువాత  సంఘటన ఆదివారం చోటుచేసుకుందని తెలిపారు. ఆ వివాహంలో ఆహారం తిన్న తర్వాత, ప్రజలు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో నీరసపడిపోయారు.

స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందారు. కేదార్‌పూర్, జవల్గా గ్రామాలకు చెందిన 336 మందిని అంబుల్గా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. కొందరికి వళంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందించారు. ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వారికి చికిత్స అందిస్తున్నామన్నారు. చాలా మంది డిశ్చార్జ్ అయ్యారు. ఫుడ్ పాయిజనింగ్‌పై ఫిర్యాదు చేసిన వారిలో 133 మంది జవల్గా గ్రామ నివాసితులు, 178 మంది కేదార్‌పూర్, 25 మంది కేట్ జవల్గా గ్రామానికి చెందినవారు అని అధికారి తెలిపారు. పరిస్థితిని పర్యవేక్షించేందుకు మూడు గ్రామాల్లో ఆరోగ్య బృందాలు ఉన్నాయని తెలిపారు.

click me!