Defamation on Sanjay Raut: సంజయ్ రౌత్ కు షాక్…! రూ.100కోట్ల పరువునష్టం దావా

By Rajesh KFirst Published May 24, 2022, 12:59 AM IST
Highlights

Defamation on Sanjay Raut: శివసేన ఎంపీ, రాజ్య సభ మెంబర్ సంజయ్‌ రౌత్‌పై పరువునష్టం దావా న‌మోదైంది. ఆధారాలు త‌మ‌పై   సామ్నా పత్రిక ఇష్టానూసారంగా.. క‌థ‌నాలు ప్ర‌చురిస్తున్నార‌ని, దీంతో త‌మ‌ పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ బీజేపీ లీడర్, ప్రొఫెసర్‌ మేధా బాంబే హైకోర్టులో రూ.100కోట్లకు దావా వేశారు.
 

Defamation on Sanjay Raut:  శివసేన అధికార ప్రతినిధి, రాజ్య‌సభ‌ ఎంపీ సంజయ్ రౌత్‌పై ప‌రువు న‌ష్టం దావా న‌మోదు అయింది. ఎలాంటి ఆధారాలు లేకుండా టాయిలెట్ స్కామ్ పేరుతో  త‌న వార్త  పత్రిక‌ సామ్నాలో కథనాలు ప్రచురించార‌నీ. ఇలాంటి చేత‌లు త‌మ‌ పరువుకు భంగం కలిగిస్తున్నాయంటూ బీజేపీ లీడర్, ప్రొఫెసర్‌ మేధా బాంబే హైకోర్టులో రూ.100కోట్లకు దావా వేశారు.

అంతే కాకుండా..  ఆ కథనాలను ప్రచురించకుండా ఉండటంతో పాటు క్షమాపణలు చెప్పాలని బాంబే  హైకోర్టును ఆశ్రయించారు. మహారాష్ట్ర(Maharashtra) బీజేపీ లీడర్ కిరీట్‌ సోమయ్య కుటుంబసభ్యులు ఓ ఛారిటబుల్ ట్రస్ట్ ను నడిపిస్తున్నారు. అయితే, బాంబే శివారులోని మీరా భయందర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో రూ.100కోట్ల టాయిలెట్‌ స్కామ్‌ జరిగిందని ఆరోపిస్తూ సామ్నా పత్రికలో వరస కథనాలు ప్రచురితమయ్యాయి.
 
ముంబై పోలీస్ ఆర్థిక నేరాల విభాగం దీనిపై దర్యాప్తునకు ఆదేశించాలని యోచిస్తున్నట్లు రౌత్ పేర్కొన్నారు. దీంతో ఆ ఆరోప‌ణ‌ల‌పై  రుయా కాలేజీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ మేధా సోమయ్య తన ప్రతిష్టను దిగజార్చేలా నిరాధారమైన ప్రకటనలు చేశారని ఆరోపించారు.

ఆమె త‌న పిటిషన్ లో ఇలా పేర్కొన్నారు. దరఖాస్తుదారు/వాది  సమాజంలో ఉన్నతమైన ఖ్యాతిని కలిగి ఉన్నారు. ఈ పరువు నష్టం కలిగించే విధంగా.. సమాజంలో త‌మ‌ స్థాయిని తగ్గించే ప్ర‌య‌త్నం చేశార‌నీ,  దరఖాస్తుదారుని/వాదిని తీవ్రంగా గాయపరిచాయి. అందువల్ల, ముఖ్యమంత్రి సహాయ నిధిలో తనకు రూ. 100 కోట్లు లేదా మరేదైనా చెల్లించాలని రౌత్‌ను ఆదేశించాలని ఆమె కోర్టును కోరింది. అంతేకాకుండా, సేన అధికార ప్రతినిధి పూర్తి అనర్హత క్షమాపణను ప్రచురించాలని, ఆరోపణలను ఉపసంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.  ఆమె త‌న‌ ఫిర్యాదును సెవ్రీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదు కూడా దాఖలు చేసింది.

 
కిరీట్ సోమయ్య-శివసేన గొడవ

2019 సార్వత్రిక ఎన్నికల్లో కిరీట్ సోమయ్యకు శివ‌సేన‌ టికెట్ నిరాకరించింది. దీంతోఆయ‌న MVA ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి శివసేన నాయకులపై  నిత్యం ఆరోపణలు, విమ‌ర్శ‌లు చేస్తూ.. శివ‌సేన రెబల్ గా మారారు. అలాగే.. కిరీట్ సోమయ్య.. డికమిషన్డ్ ఎయిర్‌క్రాఫ్ట్ INS విక్రాంత్‌ను కాపాడేందుకు నిధులు సేకరించారని, దాదాపు 57 కోట్ల రూపాయలను మహారాష్ట్ర గవర్నర్ సెక్రటరీ కార్యాలయంలో డిపాజిట్ చేయకుండా, దుర్వినియోగం చేశాడని ఆరోపణలు వ‌చ్చాయి. ఈ మేర‌కు ఓ  53 ఏళ్ల మాజీ సైనికుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.  రౌత్ వంటి శివసేన నాయకులు ఈ అభియోగాన్ని ప్రతిధ్వనించగా, సోమయ్య తండ్రీకొడుకులు బాంబే హైకోర్టు నుండి ముందస్తు అరెస్టు బెయిల్ పొందారు.

అలాగే..  ఏప్రిల్ 23న, ఇండిపెండెంట్ ఎంపీ నవనీత్ రాణా,  ఆమె ఎమ్మెల్యే భర్త రవి రాణాను కలిసిన తర్వాత ఖార్ పోలీస్ స్టేషన్ నుండి బయలుదేరుతున్నప్పుడు సోమయ్య యొక్క SUV Z సెక్యూరిటీ కవర్ ఉన్నప్పటికీ దాడికి గురైంది. రాళ్ల దాడిలో అతని SUV కిటికీ పగిలిపోవడంతో అతనికి స్వల్ప గాయమైంది. సోమయ్య ప్రకారం, ముంబై పోలీసు సిబ్బంది సమక్షంలో జరిగిన దాడికి కనీసం 70-80 మంది శివసేన కార్యకర్తలు బాధ్యులని ఆరోపించారు. 
 

click me!