సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం: 16 మంది ఆర్మీ జవాన్లు మృతి

Published : Dec 23, 2022, 03:36 PM ISTUpdated : Dec 23, 2022, 04:29 PM IST
సిక్కింలో ఘోర రోడ్డు ప్రమాదం: 16 మంది ఆర్మీ జవాన్లు మృతి

సారాంశం

సిక్కింలో  ఆర్మీ జవాన్లు  ప్రయాణీస్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో  16 మంది  ఆర్మీ జవాన్లు  మృతి చెందారు.  మరో నలుగురు గాయపడ్డారు.  

న్యూఢిల్లీ: ఉత్తర సిక్కింలోని జెమా వద్ద  లోయలో  ఆర్మీ బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో  16 మంది ఆర్మీ జవాన్లు  ప్రాణాలు కోల్పోయారు.మరో నలుగురు గాయపడ్డారు.  మలుపు వద్ద  ఆర్మీ జవాన్లు  ప్రయాణీస్తున్న  బస్సు ప్రమాదవశాత్తు  లోయలో పడింది.   ఈ ప్రమాదంలో  13 మంది ఆర్మీ జవాన్లు, ముగ్గురు  ఆర్మీ అధికారులున్నారు.   మూడు వాహనాల  కాన్వాయ్ లతో కూడా ఆర్మీ వాహనాలు  వెళ్తున్న సమయంలో ఒక వాహనం  ప్రమాదశాత్తు లోయలో పడింది. విషయం తెలిసిన వెంటనే  ఆర్మీ ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకుని  సహాయక చర్యలు ప్రారంభించారు. మృతుల   కుటుంబాలకు అండగా  నిలుస్తామని  ఆర్మీ ఉన్నతాధికారులు  ప్రకటించారు.

 

ఈ ప్రమాదంలో  గాయపడిన ఆర్మీ జవాన్లను  సమీపంలోని ఆసుపత్రికి తరలించి  చికిత్స అందిస్తున్నారు.భారత్ -చైనా సరిహద్దులోని జైమా ప్రాంతంలో  ఇవాళ  ఈ ప్రమాదం జరిగింది.  ఆర్మీ జవాన్లు  ప్రయాణీస్తున్న వాహనం  చాటేన్ నుండి తంగూకి వెళ్తున్న సమయంలో  ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో  ఆర్మీ జవాన్లు  మృతి చెందడంపై  కేంద్ర రక్షణశాఖ మంత్రి  రాజ్ నాథ్ సింగ్  సంతాపం తెలిపారు. 


 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌