బస్సులో బాలికపై హెల్పర్ అత్యాచారం: డ్రైవర్ కాపలా

Published : Dec 28, 2019, 10:27 AM IST
బస్సులో బాలికపై హెల్పర్ అత్యాచారం: డ్రైవర్ కాపలా

సారాంశం

బస్సులో 15 ఏళ్ల బాలికపై హెల్పర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బస్సు డ్రైవర్ బస్సు వెలుపల కాపలా కాస్తూ నిలబడ్డాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఆగి ఉన్న బస్సులో 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. 

నిందితుడిని బస్సు హెల్పర్ గా గుర్తించారు. బాలికను అతను బస్సులోకి తీసుకుని వెళ్లి, ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని రాజు అహిర్వార్ గా గుర్తించారు.

బుధవారం, గురువారం మధ్య రాత్రి బాలిక రాజ్ గఢ్ లోని బియోరా బస్టాండ్ వద్ద వేచి ఉన్న సమయంలో 19 ఏళ్ల నిందితుడు వచ్చి మాయమాటలు చెప్పి ఆమెను తీసుకుని వెళ్లాడు. 

ఇండోర్ లోని తన ఇంటికి వెళ్లడానికి బాలిక బస్టాండ్ లో నిరీక్షిస్తోంది. హెల్పర్ అత్యాచారం చేస్తుండగా డ్రైవర్ కదీర్ ఖాన్ కాపలాగా ఉన్నాడు. బాధితారులు గురువారం తెల్లవారు జామున సుథాలియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కదీర్ పై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !