నిద్రిస్తున్నవారిపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు: 15 మంది మృతి

Published : Jan 19, 2021, 07:33 AM ISTUpdated : Jan 19, 2021, 08:17 AM IST
నిద్రిస్తున్నవారిపై నుంచి దూసుకెళ్లిన ట్రక్కు: 15 మంది మృతి

సారాంశం

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్న కూలీల మీది నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో 15 మంది మృత్యువాత పడ్డారు.

సూరత్: గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఫుట్ పాత్ మీద నిద్రిస్తున్నవారిపై నుంచి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో 15 మంది మరణించారు. 

మృతులు రాజస్థాన్ రాష్ట్రంలోని బాన్స్ వాడ జిల్లాకు చెందిన కూలీలు అని పోలీసులు చెప్పారు. సూరత్ లోని కోసాంబ ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడిన ఆరుగురిని ఆస్పత్రికి తరలించారు. 

వేగంగా దూసుకెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి ఫుట్ పాత్ మీదికి దూసుకుని వెళ్లింది. డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు.

పెద్ద సంఖ్యలో పోలీసులు, స్థానిక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు చెరుకు లోడుతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం