భార్య అక్రమ సంబంధం.. భర్త అనుమానం.. నిద్రపోతుండగా..

Published : Jan 19, 2021, 07:23 AM ISTUpdated : Jan 19, 2021, 07:34 AM IST
భార్య అక్రమ సంబంధం.. భర్త అనుమానం.. నిద్రపోతుండగా..

సారాంశం

ఆదివారం నిద్రపోయిన సమయంలో రవి భార్య గొంతు పైన కాలుతో తొక్కి హత్య చేశాడు. ఆమె ఇంకా చనిపోలేదేమో అనే అనుమానంతో చున్నీని గొంతుకు బిగించి ఉరివేశాడు.

భార్య తనని కాదని మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందేమోనని అతనికి అనుమానం కలిగింది. ఆ అనుమానం రోజు రోజుకీ పెనుభూతంగా మారింది. వెరసి.. భార్యను చంపే స్థాయికి వచ్చింది. నిద్రపోతున్న భార్య గొంతుపై కాలు పెట్టి తొక్కి మరీ అతి దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని హుణసూరు కల్కుణికె హోసింగ్‌ బోర్డు కాలనీలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే...హతురాలు సౌమ్య(30) కాగా, నిందితుడు రవి. వీరికి 11 ఏళ్ల కిందట పెళ్లి కాగా, గౌరవ్‌ (9), అకుల్‌ (7) అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. భార్య పైన ఇటీవల అనుమానం పెంచుకున్న రవి అనేకసార్లు ఆమెతో గొడవ పడ్డాడు. ఒకటిరెండుసార్లు పోలీసుల వద్దకు వెళ్లగా రాజీ చేసి పంపారు.

కానీ రవిలో అనుమాన భూతం పోలేదు. ఆదివారం నిద్రపోయిన సమయంలో రవి భార్య గొంతు పైన కాలుతో తొక్కి హత్య చేశాడు. ఆమె ఇంకా చనిపోలేదేమో అనే అనుమానంతో చున్నీని గొంతుకు బిగించి ఉరివేశాడు. తరువాత ఇంటి నుంచి పరారైనాడు. సోమవారం ఉదయం ఎంతకు తలుపులు తీకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుణసురు పొలీసులు పరిశీలించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. రంగనాథ లేఔట్‌లో దాక్కున్న కిరాతక భర్తను అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం