మన దేశంలో ఆత్మహత్యలు ఆ రాష్ట్రంలోనే ఎక్కువ!

By telugu news teamFirst Published Sep 2, 2020, 11:54 AM IST
Highlights

 తల్లిదండ్రులు మందలించారని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని.. ప్రేమించిన వ్యక్తి దక్కలేదని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కాగా.. అసలు దేశంలో జరుగుతున్న ఈ ఆత్మహత్యలపై ఓ బృందం చేసిన సర్వేలో విస్తుపోయే నిజాలు తెలిశాయి.

ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయానికి డిప్రెషన్ కి లోనై.. ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత చాలా మందే ఉన్నారు. తల్లిదండ్రులు మందలించారని, పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని.. ప్రేమించిన వ్యక్తి దక్కలేదని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కాగా.. అసలు దేశంలో జరుగుతున్న ఈ ఆత్మహత్యలపై ఓ బృందం చేసిన సర్వేలో విస్తుపోయే నిజాలు తెలిశాయి.

దేశంలో ఆత్మహత్యలపై నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 18 వేలకు పైగా ఆత్మహత్యలతో మహారాష్ట్ర తొలి స్థానంలో నిలిచింది. 13 వేలకు పైగా ఆత్మహత్యలతో తమిళనాడు రెండో స్థానంలో ఉండగా.. 12 వేలకు పైగా ఆత్మహత్యలతో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఉంది. 2019లో తెలంగాణ రాష్ట్రంలో 7,675 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అందులో 2,858 మంది కూలీలే ఉన్నారు. 

2019లో 499 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 2019లో ఆంధ్రప్రదేశ్‌లో 6,465 మంది ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో పనులు లేక, ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. 

click me!